పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
54

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

గించినాడు” అని చెప్పెను. 24 ఫిబ్రవరి తేదిన రాజుండిన సినాన్ పట్టణమును చేరెను. రెండుదినము లామెకు దర్శన. మియ్యవ లెనా లేదాయని రాజు ఆలోచించెను. తుదకు దర్శన మిచ్చుటకు నిశ్చయించెను. ఆమె నిర్భయముగా రాజునొద్దకు వెళ్ళినది. మోకరించినది. "రాజకుమారుడా! నన్నేల విశ్వ సింపవు? భగవంతునికి నీ పైనను నీ ప్రజల పైనను జాలికలిగినది. నామాట నమ్ముము. నీ పూర్వులగు సెంటులూయీ, సెంటు షార్ల మేనులు నీకొరకు భగవంతుని ప్రార్థించుచున్నారు. నీవు నాకు సైనికుల నిమ్ము. నేను ఆర్లియన్సు ముట్టడిని వదలించి శత్రువులను వెళ్ల గొట్టి బర్గండీ రాష్ట్రములోని రైమ్సువద్ద నీకు కిరీటధారణము చేయించెదను. శత్రువులగు ఆంగ్లేయులు నీ దేశమును వదలిపోవుట భగవదుద్దేశ్యమై యున్నది.” అని రాజుతో చెప్పినది. రాజుగాని, ఆయనతో కూడ నుండిన మత గురువులుగాని ఆ మెమాటలు విశ్వసించ లేదు. అనేక ప్రశ్నలు వేసిరి. ఆమె అన్నిటికిని సమాధానము చెప్పినది. అద్భుత ములు చేసి చూపమని వారు కోరిరి. "నాచేతకాదు. నేను ఒక అద్భుతము మాత్రమీ చేసి చూపించెదను. నాకు సైన్యముల నిచ్చినచో ఆర్లియస్సునుండి శత్రువులను వెడలగొట్టెదను,” అని ఆమె చెప్పెను. ప్రజలు విశ్వసించిరి. ప్రజాభిప్రాయము సనుసరించి, రాజు ఆమె చెప్పిన చొప్పున ఆమెతో కూడ సేన లను పంపుట కొప్పుకొనెను. 1429 సం!!న ఏప్రిల్ 29 వ తేదిన జోన్ ఆఫ్ ఆర్కు సేనలను వెంటగొని ఆర్లియస్సుపై కి వెడలెను. పరాసు సేనలు ప్రార్థనము సలిపిరి. తాము భగవ