పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాలుగవ అధ్యాయము

34


యాత్రికులు పడుచున్న కష్టములను గూర్చి బోధ సలిపి, మహమ్మ దీయుల పై యుద్ధము చేసి ఏసుక్రీస్తు యొక్క సమాధిని జయిం చుటకు ప్రజలను పురికొలిపెను. ప్రతిచోటను ప్రజలు ముస ల్మానుల పైకి నెడలుటకు ఆయుధపాణులైరి. 1096 వ సంవత్స రమున పోవు ఒక గొప్ప క్రైస్తవసమా వేశమును చేసి "నాస్తికులగు " మహమ్మదీయుల పై న పవిత్రమైన యుద్ధము చేయ ఫలసినదని బోధించెను. కొలది కాలములో పదిలక్షలమంది క్రైస్తవులు తమ వస్త్రముల పై నెఱ్ఱనిగుడ్డతో శిలువలను కుట్టు కొని ఈ 'పవిత్రమగు' ఉద్యమములో 'జేరిరి. 1096 వ సం వత్సరమున క్రైస్తవ భక్తులు జెరూసలేము దండయాత తకు బయలు దేరిరి. హౌస్సునుండియు జర్మనీ నుండియు లక్ష యేబది వేల పు రుషులు, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు పీటర్ ది హెర్మిటు యొక్క నాయకత్వము కింద మతావేశముతో బయలు దేరిరి. అందరి యొద్దను ఆయుధములు లేవు. భగవంతుడు తమ్మ ప్రత్యేక ముగ సంరక్షించుననియు ప్రతిచోటను అద్భుతములు చేయుననియు సమ్మి బయలు దేరిరి. జర్మనీ గుండ పోవునప్పుడు యూదులను నరికి వైచిరి. భోజనము కొరకు తోవలో ప్రజలను దోచు కొనుచు అనేక దుష్కార్యములను చేయుచుండిరి.' హంగెరీ దేశములో నీక్రైస్తవభక్తుల దుండగము లెక్కువై నందున అచటి క్రైస్త వ ప్రజలు వీరి పై తిరుగబడి పెక్కు మందిని చంపి తమ దేశములో నుండి వెడలగొట్టిరి. చాపగ మిగిలిన క్రైస్తవ భక్తులు కాన్ స్టాంటు నోపిలు చేరగ చక్రవర్తి వారి అల్లరుల నుండి తప్పించుకొనుటకు త్వరగ ఆసియా మైనరుకు పంపెను. .