పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
34

ప్రెంచిస్వాతం త్వపజయము


సమాధిని దర్శించి పచ్చుచుండివారు. జరూసలేము పట్ట ణము చాలకాలమునుండియు ముసల్మానుల వశమం దుండెను. కానీ 'భాగ్దాదు, ఖైరో ఖలీఫాలు మతసహసము గలవారు. క్రైస్తవుల కేమియు నిబ్బందులు కలిగించ లేదు. యాత్రికులకు అడ్డు లేకుండనుండెను 1055 నం. వత్సరమున నీఖలీ ఫాల యధికారము పడిపోయినది. సెబ్బూకి యను జాతికి చెందిన తురుష్కులు బాగ్దాదును జయించిరి.కొలది కాల ములో సిరియా, పాలేస్తైన్ దేశములు వీరి స్వాదీనమయ్యెను. జెరూసలేమును దర్శించుటకు వెళ్ళిన క్రైస్తవ యాత్రికులకు వీరు చాల ఇబ్బందులు కలుగ చేసిరి. ఈ యాత్రికులను ముసల్మా నులు చాల బాదలు పెట్టుచున్నారని యూరఫుఖండములోని ప్రతి దేశములోను చెప్పుకొనసాగిరి. ఇంతలో తురుష్కులు ఆసియ మైనరులో ప్రవేశించి 1071 న సంవత్సరమున కాంస్ట్రాన్ టీ నోపిలునుండి వచ్చిన క్రైస్తవ సేనల నోడించి గ్రీకు చక్రవ ర్తిని ఖైదు చేసిరి. యూరపుకు తూర్పున నేగాక పశ్చిమమునగూడ ముసల్మానులు చెల రేగి 1086 వ. సంవత్సరమున 'స్పెయిన్ దేశమున జెల్లకా వద్ద క్రైస్తవులకును ముసల్మానులకును జరిగిన గొప్ప యుద్ధములో ముసల్మానులే పూర్తిగ జయమందిరి . “క్రైస్తవమతము, క్రైస్తవనాగరికత, అపాయకరమగు స్థితి యం దున్నవి; వెంటనే రక్షింపుడు,” అను సందేశమును రో ములో నున్న క్రైస్తవప్రధానాచార్యుడగు పోపు ఏడవ గ్రెగరీ యూరఫుఖండమున కంతకును పంపెను. పీటర్ ది హెర్మిటు ఫ్రాన్సు దేశ మంతటను సంచారము చేసి క్రైస్తవ