పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
36

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

జయించుట, అచటివారి నందరిని తురుష్క సేనలు నరికి వేసిరి. పీటర్ ది హెర్మిటు తప్పించుకొని పోయెను,

జెరూస లేమును
జయించుట

ఈలోపున యూరపు ఖండమునుండి ప్రభువుల క్రింద గొప్ప క్రైస్తవ సైన్యములు బయలు దేరి నలువైపుల నుండియు కాక స్టాంటినో పిలును చేరిరి. వీరిలో ఇతర దేశీ యులకన్న పరాసు పరాసు ప్రభువులెక్కువమంది యండిరి. తురుష్క సేనలనుండి జయించెడి దేశములను గ్రీకు చక్ర వర్తికి సామంత రాజులుగ మాత్రమే స్వాధీనమును పొందెద మని ప్రమాణము గైకొని వీరు ఆసియా మైనరులో ప్రవేశించి, త్రోవలో అడ్డగించిన తురుష్క సేన నోడించి, తుదకు జరూస లేమును చేరిరి. పీటర్ ది హెల్మెటు యొక్క నాయకత్వము క్రింద ఈ క్రైస్తవ సేనలన్నియు జరూసలేము పట్టణము చుట్టును ప్రదక్షిణము చేసి పట్టణమును ముట్టడించిరి. ముట్టడి అనేక దినములు పట్టెను. తురుష్కులు జాగ్రత్తగా పట్ణమును సంరక్షించుచుండిరి. తుదకు 1099 వ సంవత్సరము 15 వ జులై తేదీన క్రైస్తవులు మతా వేశముతో గోడల నెక్కిరి. పట్టణములో ప్రవేశించిరి. క్రైస్తవులకు జయము కలిగెను. ముసల్మానులను చంపుట భగవత్ప్రతియగు కార్యమని నమ్మి క్రైస్తవులు ముసల్మానుల సందరిని హత్య గావించిరి. “భగ వంతుని యనుగ్రహమువలన నడుములోతున పొరుచున్న ముసల్మానుల రక్తప్రవాహముగుండ క్రైస్తవ భక్తులు వెళ్ళి “ఒక చెంప మీదకొట్టినచో రెండవ చెంపనుకూడ నిమ్ము,” "నీశత్రువులను ద్వేషింపక ప్రేమింపుము” అను ప్రేమా సందే