పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ ఆధ్యాయము.

27


కాలమువరకు పరాసు దేశములో రాజు యొక్క స్వంతకమతము కింద సుంచుకొనిన భూమి స్వల్పమై సామంత రాజులుసు, ప్రభువులును దేశములో రాజున కన్న ఎక్కువ బలవంతులు గ నుండిరి. ఆకాలమున రాజు వేరుగ పన్నులు వసూలు చేయు పద్ధతి లేనే లేదు.987 వ సంవత్సరమున పరాసు దేశమునకు హ్యూజు కాపటు రాజయ్యెను. ఈకాపటు పంశీకులగు రాజులు తమ స్వంతకమతపు భూములను వృద్ధి చేసికొని క్రమముగా బలవంతులైరి. ఏదో సాట బెట్టి సొమంతుల నుండి భూమిని లాగుకొని స్వంతకమతములో జేర్చుకొనిరి. 'స్వంతకమతపు భూములలోని వ్యవసాయక బానిసల స్థితి దుర్భరముగ నుండెను. భూములను విడిచి ఇష్టము వచ్చిన చోటికి పోయి జీవించుటకు వీలు లేదు. వీరిని తమ భూఖామందులను ప్రభువు లెట్టిశిక్ష విధిం చినను ఖైదులో వేసినను కొరడా దెబ్బలు కొట్టినను భూమిలో నుంచి వెడలగొట్టినను ప్రభువు నడుగు వారు లేరు. వీరు ప్రభువు చెప్పిన అన్ని పనులును చేసితీరవలెను. భూమి అమ్మబడినపుడు భూమితో కూడ వీరు నూతన ప్రభువుకిందికి పోవుదురు. వీరు చనిపోగనే వీకిఆస్తి అంతయు తమ భూకామందునకు చెందుసు. ఇట్టివారుగాక భూఖామందులగు ప్రభువు" భూములను వ్యనసాయము చేయుచు వారికి నియమిత మైన సేవను శిస్తును అర్పించెడి వ్యవసాయకులు కూడ కొందరుగలరు, వీరు సాధా రణముగ పండిన పంటలో కొంతభాగము చెల్లింతురు. భూ ఖామందుయొక్క ఇతర భూములమీదసు . దాక్షతోటల లోను పనిచేయవలెను. ఆయన కోటను బాగుచేయవలెను.