పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
28

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

సామానులను బండ్లను బాగు చేయవలెను. భూ కామందు యొక్క రోడ్లను వేయవలెను. వీరి ఆస్తి వీరిపిల్లల కు చెందును. వీరిపై విచారణహక్కు భూఖామందులకే గలదు. భూఖామందుల తీర్పుపై వ్యవసాయకులకు మరెక్కడను చెప్పు కొనుటకు హక్కు లేదు.

జాతి భేదములు

మధ్యమయుగమున యూరపుఖండము లోని దేశము లన్నిటిలోను సంఘముమూడు జాతులుగా విభజింపబడి యుండినది.

మొదటిజాతి
ప్రభువులు,

మొదటి జాతీయగు ప్రభువులకు శిరస్సు రాజు. సామంత రా జులు, పెద్ద ప్రభువులు, చిన్న ప్రభువులు, మొదలగు ప్రభువు లంద రుసు ఈ జాతి లోనివారు. వీరందరును భూఖామందులు వీరిలో వీరు వివాహమాడుచుండిరి. సామతం రాజులుసుగొప్ప ప్రభువులును సాధారణముగ రాజ బంధువులుగ నుండిరి. సామాన్య ప్రజలకన్న పుట్టుక వలన అధికుల ముని భావి చుచు నీ ప్రభువులజాతి నామాన్య ప్రజల మీద గొప్పగొప్ప అధి కారములను గలిగియుండెను. ప్రభువులకు తమ భూములలోని వ్యవసాయకులమీదను, వ్యపసాయ బానిసల మీదను, కాపుర ముండు ఇతర ప్రజల మీదను నిరంకుమగు న్యాయవిచా ణాధికారి హక్కులు గలవు. ఖైదు, దెబ్బల శిక్ష మొదలగు సవి వేయవచ్చును. గొప్పప్రభువులకు మరణశిక్ష విధించు హక్కుగూడ నుండెసు. ప్రభువులందరును తమంతట తాము యుద్ధము చేయవచ్చును. సంధి చేసికొనవచ్చును. ఇష్టము. వచ్చినంత సైన్యము నుంచుకొని వచ్చును. ఇష్టమువచ్చిన ఆయు