పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
26

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

తుడు ప్రభుసహాయమునకై పోనక్కర లేదనియు క్రమముగా నాచార మేర్పడినది. ఒక సైనిక సహాయ మేగాక ప్రభువునకు సామంతుడు కొన్ని ఇతర సహాయములను చేసితీరవలెను . సామంతుడు చనిపోయినప్లు,డాతని వారసులు ప్రభువునకు కొంత ద్రవ్య మిచ్చినగాని భూమిలో ప్రవేశించవీలు లేదు. దూరవార సునకు భూమి సంక్రమించినపుడు ప్రభువున కెక్కువ సొమ్ము నియ్యవలెను. ఇయ్యవలసిన సొమ్ము ఆచారమువలన స్థిర పడి నది. ప్రభువు ప్రయాణము చేయుచున్న వుడును,వేటాడుటకు బయలు దేరినపుడును ఆయనకును ఆరుస అనుచరులకును సామంతుడు ఆతిథ్య మీయవలయును, ప్రభువు యుద్ధ ములో శత్రువులచే జక్కి నపుడు సామంతుడు ఎంతధసమై నను ఇచ్చి ప్రభును విడిపించుకొని రావలెను. ప్రభువు యొక్క ప్రథమ పుతిక యొక్క వివాహమునకును అతని ప్రథమకుమారుడు ఆయుధధారణము గావించినపుడును సొమం తుడు కొంత సొమ్ము నియ్యవలెను, ప్రభువు కోరినపుడెల్ల సామం తుడు సలహా ఈయవలెను. భూమి వారసత్వముగా జ్యేష్ఠ కుమారునికి మాత్రమే సంక్రమించును. వారసు లెవరును లేనపుడును, సొమంతుడు ప్రభువుపై తిరుగ బాటు చేసినపుడును సామంతుడు షరతులకు వ్యతిరేకముగ ప్రవర్తించినపుడును భూమిని ప్రభువు తీసికొనును.

వ్యవసాయక
బానిసలు

రాజుగాని సామంత రాజుగాని ప్రభువులుగాని తను క్రింది వారికి స్వాధీనపరుపక తమ స్వంతకమతము కింద నుంచు కొనిన భూములను వ్యవసాయక బానిసలచే (సర్ఫ్స) సేద్యము చేయించుకొనిరి. కొంత