పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ ఆధ్యాయము

క్రింది. చిన్న ప్రభువును, ఈవిధముగా పైవాడు తన క్రింది వానిని శత్రువులనుండి రక్షించెదనని వాగ్దత్తము చేసిరి. భూమిసిచ్చినందునకు పైవానికి క్రింది వాడు భక్తిప్రమారాణము గావించుటయేగాక సైన్యములతో సహాయము చేయవలెను. రాజు యుద్ధమునకు వెడలగనే సొమంత రాజు, సామంత రాజు వెడలగ నే ప్రభువు, ప్రభువు వెడలగ నే కింది ప్రభువు, ఈవిధ ముగ ప్రతికిందివాడును తన పైవానికి సహాయముగ సైన్య ములను తీసికొని వెళ్ళవలెను. ఇటుల భూమునిచ్చుట, భక్తి ప్రమాణము, శత్రువుల నుండి రక్షణ, సైనిక సేవ, ఇవి మొఖా సాపద్ధతిలో పై వానిని కిందివాసిని బంధించు ముఖ్య నిబంధనలు. రాజ్య మంతయు భూఖామందులగు సామంత రాజులతోడను గొప్ప ప్రభువులతోడను చిన్న ప్రభువుల తోడసు నిండెను. ఈ ప్రభువు లెప్పుడుసు ఆ యుధములను ధరించి సైన్యములను తయారుచేసికొని కోటలను నిర్మించుకొని యుద్ధములకు సం సిద్ధులుగ నుండిరి. ప్రభువులు చిన్న తనమునుండియు యుద్ధమున కౌశలము చూపి పేరు పొందవలెనని శిక్షను పొందుచుండిరి. ప్రతిదానికిని కత్తిదూయుట సామాన్యమయ్యెను. ప్రభువులకు యుద్ధము ప్రథానవృత్తియయ్యెను.


ప్రభువునకు
చేయుపమలు.

రాజు మొదలగు పై వారిని ప్రభువులనియు , శ్రీది వారిని సామంతులనియు పిలుతము. ప్రభువునకు సామంతుడు సంవత్సర మునకు నలుబది దినములు మాత్రము సైనిక సహాయము చేసి తీరవలెననియు తాను పొందిన భూమి నుండి కొంతదూరముకన్న నెక్కువ దూరము సామం