పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ అధ్యాయము

క్షించ లేక పోయిరి. అందువలన రాజులు తమ అధికారమును సామంత రాజులకును ప్రభువులకును పంచి యీయవలసి వచ్చెను, నార్మనులనుండి పరాసు దేశ మును కాపాడుటకై ప్రభువుల ను కోటలు కట్టుకొమ్మని రాజు లు తరువులిచ్చుట చూచి యున్నాము. ప్రభువులను సామంత రాజును బలవంతులుగ చేయవలసివచ్చెను. సంఘ: మరాజకముగ నుండెను. బలవంతు' లు బలహీనులను ఒత్తిడి చేయుచుండిరి. పశుబలమే. రాజ్యము చేయుచుండెను. ప్రతివారును స్వసంరక్షణ కొరకై కత్తి పట్ట వలసి యుండెను. సామాన్య జనులు తమ్ము తాము రక్షించు కొన లేక తమ స్వతంత్రతను పోగొట్టుకొని బలవంతులగు ప్ర భువు లయండను జేరిరి. ప్రభువులు ప్రజలను సంరక్షించుచుండిరి. ఈ విధముగా ప్రభుపరంపర యొక్క యావశ్యకత ఏర్పడినది.

స్వంతముగ నౌకరీ చేయుట

మఖాసాప్రభు పరంపరాపధ్ధతిలోగల ప్రధాన సూత్ర మేమసగా స్వయముగా నౌకరీ చేయుట. ఒకరి యొద్ద మరియొకరు భూమిని కౌలుకుతీసికొనినచో ఈకాలమున ద్రవ్య రూపకముగ శిస్తు నిచ్చును. అకాల మందు భూఖామందుకు స్వయముగా నౌకరీ చేయవలెను. యూరఫుఖండమున మధ్య మ యుగములో తగినన్ని నాణెము లు లేవు. కాగితపు దవ్యమును (నోట్లను) వా రెరుగ నేయెగరు. ఆ కాలమున మూలధనము కూడ తక్కువ. మరియు నీ పరిస్థితిలో మనుష్యులు చేసిన చట్టములకన్న అచారమే ప్రధా నముగ నుండెను.