పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
22

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము


యూరఫుఖండములోని అన్ని దేశములలోను పదునెనిమిదవ శతాబ్దము వఱకును నిలిచియుండెము. ఈ పరిస్థితుల పై తిరుగ బాటు చేసి నాశనము చేయుటకు 1780 వ సంవత్సరమున పరాసు దేశములో ప్రజాస్వాతంత విప్లవము జరిగెను. ఈ ప్రభుపరంప రాపధ్ధతి ఇంకను ఇంగ్లాండులో పూర్తిగచావక ఆంగ్లేయ పొర్ల మెంటులోని ప్రభువుల సభ రూపమునను, ఇంగ్లాండులోని భూ ఖామందు రయితుల మధ్య హక్కు లలో కొంతపఱకును, నిలిచి యిన్నది. ఇప్పటికీని ఇంగ్లాండులోని ప్రభువులు సామాన్య ప్రజలతో కలియక వేరుగ క్లబ్బులను స్థాపించుకొనియున్నారు. నామాన్య ప్రజలను తమకన్న తక్కువవారిగ చూచుచున్నారు. పరాసు విప్లవము తిరువాతి ఫ్రాస్స దేశములోను అమెరికా లోను ప్రభువులు లేరు.


ఆ కాలపు ప్రజల అవసరములను బట్టియు అభిప్రాయములను బట్టియు నీ ప్రభువు పరంపరాపద్ధతి ఏర్పడినది. దీనియొక్క ప్రధానలక్షణము రాజుయొక్క , అధికారము మిగుల బలహీనమై సామంత రాజు లయొక్కయు వారి కింది ప్రభువుల యొక్కయు అధికారము మిగుల బలముగానుండుట. తొమ్మిది, పది శాతాబ్దములలో యూరపులోని రాజులు బలహీనులుగ నుండిరి. రోమక సామ్రాజ్యము కూలిపోయెను. దానితరువాత వచ్చిన షార్ల మేను యొక్క సామ్రాజ్యము ఆయన మరణముతోనే విచ్ఛిన్న మయ్యెను. ఫోన్సులోని బలహీనులగు రాజులు నార్మనుల నుండియు జర్మ నీలోని రాజులు మాగీయారులనుండియు తమ ప్రజలను నంద