పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రెంచిస్వాతంత్ర్యవిజయము

మూడవ అధ్యాయము

మొఖాసా ప్రభుపరంపర

మొఖాసా ప్రభుపరంపర

క్రీస్తుశకము తొమ్మిదవ శతాబ్దమునుండియు యూరోపు లోని తక్కిన దేశములలో వలెనే ఫాస్సు 'దేశమునందు గూడ 'మొఖాసాప్రభు 'పరంపరాపద్దతి స్థాపించబడెను. రాజులు బలహీనులగుటచేత నీపద్ధతి త్వరితముగ వ్యాపించెను. పదవ శతాబ్దమున నీ పద్ధతి పరాసు జర్మనీ దేశములలో పూర్తిగా విజృంభించెను. 1066 వ సంవత్సరమున నార్మండీ రాష్ట్ర ప్రభువగు విల్లియం ఆంగ్లేయు దేశమును జయించి పాలనము నెలకొలిపెను. ఆయన ఆంగ్లేయ దేశమునందుగూడ నీ మొఖానాపద్ధతిని పూర్తిగ స్థాపించెను. ఈ పద్ధతివలన నేర్పడిన రాజకీయ నాంఘిక పరిస్థితులు

21