పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/37

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
24

ప్రెంచి స్వాతంత్ర్య విజయముభూమి నిచ్చుట

భక్తిప్రమాణము

మొఖాసా పద్ధతిలో గల మరియొక సూత్రము దేశము లోని భూమియంతయు రాజుది అనునది.. రాజు కొద్ది భూమిని తనక్రింద నుంచుకొని మిగత యావత్తు భూమిని తినకింది సామంత రాజులకుపంచి యిచ్చెను. అభూమిని పుచ్చుకొనినందుకుగాను రాజునకు సా మంత రాజులు రాజభ క్తిప్రమాణమును చేసిరి. రాజు వొద్దకు సామంత రాజు తలకు టోపిలేకుండసూ, చేతిలో నాయుధము లేకుం డసు వచ్చి మోకరించి " నేను మీమనిషిని” అని ప్రమాణ ము చేయును. రాజు సామంత రాజును ముద్దాడి చేతులతో లేవ నెత్తును. సామంత రాజుకు భూమిని స్వాధీనము చేసితినని చెప్పి అందుకు చిహ్నముగ నొక చెట్టుకొమ్మ నిచ్చును. అటు లనే సామంత రాజు కొంతభూమిని తన స్వంతముక్రింద నుంచు కొని మిగిలినదానిని నంతను కొందరు ప్రభువులకు పంచియిచ్చె ను. సామంత రాజుకు ప్రభువులు మోకరించి 'నేను మీమనిషిని' అను ప్రసూణము చేసిరి. సామంత రాజు ప్రభువులను ముద్దాడి లేవ నెత్తి భూమిని స్వాధీనము చేసితినని చెప్పి చెట్టు కొమ్మ నిచ్చెను. తిరిగి ప్రభువులు తమ కిందనున్న భూమిని చిన్న ప్రభువులకును, వారు తమభూమిని ఇంకా కొద్ది ప్రభువుల కును, వారు మరికొద్ది ప్రభువులకును పంచియిచ్చిరి. పైవారికి క్రిందివారు భక్తి సూచకమైన ప్రమాణము చేయుటయు, క్రింది వారిని పైవారు లేవనెత్తీ భూమినిచ్చితినని చెప్పి చెట్టు కొమ్మ నిచ్చుటయు జరిగెను. రాజు సామంత రాజును, సామంత "రాజు ప్రభువును, ప్రభువు తన కింది ప్రభువును, ఆతఁడు తన