పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండపఆద్యాయము

19

వేశమగుచు తమతమ యభిప్రాయములను 'వెలిబుచ్చుచుండిరి, ఈసమావేశములతో బాటు తన సేనలన్నిటినీ సమావేశపరచి తన బలమునుకూడ ప్రదర్శించుచుఁండెను. తరువాత ఫ్రాన్సు దేశ పు రాజులు సమావేశ పరచిన స్టేట్సు జనరలు కిది పునాది. రాజ్యమునంతను జిల్లాలుగా విభంచి జిల్లాపైన సివిలు, క్రిమి నలు, సైనిక అధికారములను చలాయించు కౌంటు (ప్రభువు) లను నియమిం చెసు పాఠశాలలను స్థాపించి విద్యావ్యాపకము చేసెను. గ్రంథకర్తలకు ప్రోత్సాహము కలుగ జేసెను. మంచి కట్టడములను కట్టించెను. రైను, డాన్యూబు నదులను కలుపు టకై గొప్ప కాలువను తవ్వించెను. ఈ గొప్ప చక్రవర్తి 814 సువత్సము జనవరి నెల 28వ తేదీని చనిపోయెను.


నార్మనులు

షార్ల మేను చనిపోయిన తరువాత ఆయనమనుమలు రా జ్యము యొక్క పంపిణీ కొరకై తమలో తాము యుద్ధములు గావించి కొనిరి. తుదకు 843వ || సం. మున వెల్డన్ వద్ద జరిగిన సంధివలన జన్మనీ యొక మనుమనికిని, ప్రాన్సు మరియొకరికిని, ఇటలీ స్విడ్జర్లాండులు మూడవవానికిని పంపకములో వచ్చెను. ఇటలీ దేశ మును పాలించువారికే చక్ర వర్తి బిరుదము చెందెను. చార్లెసు ది బాల్డు ఫ్రాన్సు దేశమునకు రాజయ్యెను. ఫ్రాన్సు దేశము చాలకాలము వరకును మిగుల బలహీనులగు రాజులచే పాలించబడెను. నార్వే మొదలగు నుత్త రదేశముల నుండి మిగుల క్రూరులగు ఓడదొంగలు పరా సురేవులకు వచ్చి దోచుకొనుచుండిరి. రాజు లేమియు చేయజూ లకుండిరి. ప్రజలు నిస్సహాయులుగ నుండిరి. ఈయోడదొంగల