పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
18

ప్రెంచి స్వాతంత్ర్యవిజయము

షార్ల మేను రోమునగరముననే చక్రవర్తి యయ్యెను. దీనివలన షార్ల మేను యొక్క రాజ్యమునకుగాని అధికారమునకుగాని గలిగిన యాధిక్యత లేదు. కానీ షార్ల మేను సంతతివారు ఈ చక్రవర్తి బిరుదము మిగుల గొప్పదని భావించి, ఇందువలన తాము యూరఫు ఖండములో లెల్ల అధి కులమని తలంచుచుం డిరి. ఈ బిరుదము కలిగియుండుటనలన తాము షార్ల మేను చక్రవర్తి యొక్క వారసులేగాక, రోమశ సామ్రాజ్య చక్ర వర్తులగు జూలియసు సీజరు, అగస్టసు, కాన్ స్టాంటైన్, మొద లగు సుప్రసిద్ధ చక్రవర్తులకును వారసులమని గర్వపడుచుం డిరి. మధ్య మయుగ చరిత్రలో సచక్రవ ర్తిత్వము చాల ప్రాము ఖ్యతను వహించెను.

రాజ్య పాలనము

షార్ల మేను చక్రవర్తి రాజ్యపాలనమునందు సమర్దుడని ప్రసిద్ధి బడసెను. తన రాజ్యము విశాలమైనది. ఆయా ప్రాంతములలోని ప్రభువులును ప్రజలును ఎపుడై నను. తిరుగబాటు చేయవచ్చును. అట్టివి జరుగకుండ చేయుటకై తాను తఱుచుగా సంచారము చేయుచుండెను. తనయుత్తరువులను అమలు జరుపుటకు రాజు ప్రతినిధుల నేర్పఱచెను. సంవత్సరమునకు రెండుసారులు-- వేసవికాలమున నొక సారియు, ఆకురాలు కాలమున నొకసా రియు — తన రాజ్యపాలనమును గూర్చి ముఖ్య విషయములలో ప్రజాభిప్రాయము కనుగొనుటకు గొప్ప సభలను సమావేశము చేయుచుండెను. ఆ సభలలో మతగురువులు వేరుగను, ప్రభువులు వేరుగను, సామాన్య ప్రజల లోని ముఖ్యులు వేరుగను, సమా