పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ అధ్యాయము

17

. పోపునకు జూతులనుండి జయించి, అవారుల ముఖ్య నాయకులను క్రైస్తవ మతమును స్వీకరించునటుల చే సెను.


పోపునకు సహాయము

పోపు (రోములోని క్రైస్తవ ప్రథాసమతాచార్యు) నకను ఇటలీలోని లంబార్డి రాజునకును విరోదము ప్రబలియుండెను. పోపు షార్ల మేను యొక్క సహాయ మపేక్షింపగ 773 వ సంవత్సరమున షార్లమేను ఇటలీ పై దండెత్తి లంబార్డినంతను జయించి , తన రాజ్యములో కలుపుకొనెను. 797 వ సంవత్సరమున చనిపో న పోపు యొక్క బంధువులకును కొత్తగావచ్చిన పోపు మూడవలియోకును కలహములు కలిగి వారు పోపు లియోను ముట్టడించి పోపు యొక్క, ఒక కన్ను పొడిచి వైచి ఆయనను ఖయిదు చేసిరి. కాని పోపులియో తప్పంచుకొని పారిపోయి షార్ల మేసు రాజువద్ద చేరెను. 800 వ సంవత్సరమున షార్ల మేను రాజు రోము పై దండెత్తి పోపు యొక్క శత్రువులను వెడలగొట్టి పోఫులియోను ప్రధాన క్రైస్తవపీఠ మలంకరింప జేసెను, పోపు షార్ల మేసుకు మిగుల కృతజ్ఞుడై యుండెను.


షార్లమేను చక్రవర్తి యగుట

800 వ సంవత్సరము క్రిస్టమసు పండుగనాడు రోము లోని సెంటుపీటర్సు దేవాలయమునకు పార్ల మేను 'రాజు వెళ్ళెను. క్రైస్తవ ప్రార్థన లయిన తరువాత పోవు మూడనలియో లేచి వెళ్లి షార్ల మేను తల పైన కిరీటమునుంచి యాశీర్వదించి చక్రవర్తి యను బిరుదము నిచ్చెను. రోమక సామాజ్యము పడిపోయిన తరువాత యూరపుఖండమున చక్రవర్తి బిరుదాంకితులు లేరు. ఇపుడు

.