పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/33

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
20

ప్రెంచిస్వాతంత్ర్య విజయము

బాధ క్రమముగా ఎక్కువయినది. వీరు తండోపతండములుగు ప్రాన్సు దేశములో ప్రవేశించి ప్రజలను హింసించియు దోచు- కొనియు పైరుపంటలను నాశనము చేసియు పోవుచుండిరి: వారి నెదిరించిన వారిని క్రూరముగ వధించుచుండిరి. ఈ యోడ దొంగలకు నార్మనులని పేరు. వీరికి కొంతకాలము ఫ్రెంచి రాజు లువిశేష ధనమిచ్చి పంపి వేయుచుండిరి. లంచమిచ్చిన కొలది మరల వచ్చి బాధించుచుండిరి. 885 వ సంవత్సరమున వీరు ప్రెంచి రాజధాని యగు పారిసు పట్టణమును ముట్టడించిరి

. వారి సుప్రజలును, ప్రభువులును మిగుల ధైర్యముతో పోరాడి నార్మముల నోడించి తరిమి వేసిరి. కాని ఇంతటితో నార్మసుల దండ యాత్రలాగ లేదు. ఫ్రెంచి దేశములోని ప్రభు వులందరును అమతమ కోటలను బాగు చేసికొని కొత్తకోట లనుగూడ నిర్మించవలసినదని పరాసు రాజు ఉత్తరువు చేసెను. నార్మనులనుండి దేశ సురక్షణము గావించుకొనుటకు ప్రభు పులు ప్రతి చోటను కోటలను గట్టి. తాత్కాలికముగా పరాసు ప్రభువులు నార్మనుల నోడించుచు వచ్చిరి. 112 వ సంవత్సర మున పరాసురాజు నార్మసులతో సంధి చేసికొని ఫ్రాన్సు దేశ ములోని నార్మండి రాష్ట్రమను వారికిచ్చెను. నార్మనుల దోపిడీలు ఆగిపోయెను. నార్మను ప్రభువులును నార్మను ప్రజలును ఫాస్సులో కావుగమేర్పరచుకొని ఫ్రెంచి భాషను నేర్పికొని' తక్కిన ఫ్రెంచి ప్రభువులతోను ప్రజలతోను కలసిపోయిరి. నార్మండీ రాష్ట్రము కొలదీ కాలములో మిగుల శాంతియుతమై నట్టియు భాగ్యవంత మయినట్టియు రాష్ట్ర మయ్యెను.