పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
14

ప్రెంచి స్వాతంత్ర్య విజయము

రిగా ఎంత సొమ్ముతో ప్రయాణము చేసినను అపాయము లేనంత నిర్భయముగ నుండును. విదేశీయులు హిందూ దేశము పై దం డెత్తుటకు వెఱచిరి, ఆకాలమున హిందూదేశము లోకములో కెల్ల నగ్రస్థానము వహించినది. యూరపు ఖండవాసుల నిచటి కాకర్షించినది. 1707 సంవత్సరమున 'మొగలాయి రాజ్య మస్తమించెను. వెంటనే హిందూ దేశములో కొంత కాల మరాజకము ప్రబలెను. ఈ అరాజక కాలములో ప్రెం చివారును ఇంగ్లీషు వారును స్వదేశ రాజుల అంతఃకలహములలో ప్రవేశించి తమరాజ్యమును స్థాపించుటకు పోటీగ కృషి సలిపిరి. కాని ప్రెంచివారి సంకల్పము విఫలమై ఆంగ్లేయులు సొమా జ్యమును స్థాపించిరి. తమరాజ్య స్థిరతకొరకు కొన్ని కట్టుదిట్ట ములను చేసి అరాజకమును పోగొట్టి శాంతిస్థాపనము చేసిరి. అటులనే రోమక రాజ్యము కొన్ని శత్వాములు యూరపులో సాగరికతకు శాంతికి కట్టుదిట్టములకు తోడ్పడినది. అది అయి దవశతాబ్దములో కూలిపోయినది. మూడువందల సంవత్సర ములకాలము యరపుఖండమంతయు అరాజకముగమ అశాం తిగను ధర్మము, న్యాయము లేక బలవంతులదే హక్కుగను ఉండి వివిధ జాతుల పోరాటములలో మునిగియుండెను. తుదకు 770 వ సంవత్సమున బలవంతుడగు షార్లమేను రాజు బయలు దేరి ఫొస్సు, జర్మనీ, ఇటలీ, స్పెయిను దేశ ములను లోబరచు కొని శాంతిస్థాపన చేసెను. ఈయన ఏర్పరచిన పద్ధతులు కొంత కాలము బాగుగాసాగి ఈయన మరణించగానే తిరిగి అరాజక మేర్పడెను.