పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ ఆధ్యాయము

13

03 మించెను. ఈ అన్ని దేశములలోను ఆయన చేసిన పనులు, ఏర్పరచిసవిధానములు కొన్ని తరములవరకును నిలిచినవి. ఆయన 'పండిత పోషకుడు. క్రైస్తవమతమునకు పట్టుకొమ్మ. ఆయన యొక్క గొప్పతనమునకుగాను పోపు ఆయనకు చక్రవ ర్తి యను బిరుదము నొసంగెను. ఈయన పాలనముతో యూరపు ఖండ మున ప్రాచీనయుగమంతమై రోమక రారాజ్యము పడిపోయిన తరువాత నేర్పడిన అరాజక మంతరించి నూతనశకము ప్రారంభ మయినది.


శాంతిస్థాపన,

ప్రతి గొప్ప రాజ్యమును బలవంతమయినదై తనయేలు బడిలోని ప్రజలలో కట్టుదిట్టముల నేర్పరచి శాంతిని స్థాపించును. శాంతి స్థాపన రాజ్యము సాగుటకు మిక్కిలి ఆవశ్యకము. అరాజకములో ఏరాజు యొక్క.. పాలనమును సాగదు. పన్నులు వసూలగుటకును రాజ్యలాభము ను పొందుటకును వీలుండదు. ఎల్లప్పుడును అరాజకుల వలనసు బందిపోటు దొంగలవలనను ప్రభుత్వపు బొక్కసము లకును ప్రభుత్వోద్యోగులకును భయముండును. కావున శాంతిసాపనము, ప్రజలకన్న నెక్కుడుగ ప్రభుత్వముల కావశ్య కము. ప్రతి గొప్ప రాజ్యమును తాను స్థిరముగ నిలుచుట కై ముందుగ శాంతిస్థాసనను చేయును. కాని ఆ రాజ్యము పడిపో గనే కొంత కాలము కట్టుదిట్టములన్నియు పోయి దేశములో నరాజకము ప్రబలును. హిందూ దేశమును 1526 మొదలు 1707 వరకును మొగలాయి చక వర్తులు రాజ్యము చేసి మిగుల నాగరికమైన కట్టుదిట్టములను చేసి శాంతిని స్థాపించిరి. ఒంట