పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండడ అధ్యాయము

15


ఆరాజకమునకు
సిద్దౌషదము

నిరంకుశ రాజ్యముల రహస్య మేమనగా పాలకులు బల వంతులుగ నున్నంత కాలము మాత్రమే సాగును.. వారి బలము క్షీణించగనే రాజ్యము కూలిపోయి అరాజక మేర్పడును. కాని దేశములోని ప్రజ లలో జాతీయ భావ మేర్పడి ప్రజాపాలన ముండినచో దేశము లోని నిరంకుశ రాజ్యములు పుట్టుటయు, కూలిపోవుటయు, తిరిగి అరాజకము ప్రబలుటయు తటస్థించ నేరదు. ప్రజా పాలన మే అరాజకము రాకుండుటకు సిద్దౌషదము. శాశ్వత శాంతికి పునాదియగు ప్రజా పాలనముకొర కే ప్రస్తుత ప్రపంచము పరిత పించు చున్నది.

షార్లమేను
జయములు

షార్ల మేను అజాను బాహువు, కడు 'ధైర్యశాలి.గుఱ్ఱపు సవారి చేయుటలోను, వేటాడుటలోను మిగుల నేర్పరి. తినుటలోను, త్రాగుట లోను మితమైన అలవాటులు గలవాడు. అనేక భాషలు నేర్చినవాడు. పండితపోషకుడు. ఉదారస్వభావుడు, రాజ్యమును బాగు చేయుటకు దీక్షవహించిన వాడు. ఆయన అనేక ప్రదేశములను జయించి కీర్తివడ సెను. ఫ్రాన్సు దేశ స్వతంత్రముగ నుండిన అక్విటైనును. తన రాజ్యములో కలుపుకొ నెను. పిదప స్పెయిన్ దేశములోని మహమ్మదీయుల పై దండెత్తి కొన్ని జయములను బడసెను. స్పెయిన్ లోని మహమ్మ దీయులలో కలిగిన అంతఃకలహముల యవకాశమును తీసి కొని షార్ల మేను రాజు పెరిన్నీసు పర్వతములను దాటి స్పెయిన్ ప్రవేశించి 797 వ సంవత్సరమున వార్సిలోనా పట్టణమును