పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

245

పదునారవ అధ్యాయము

గానము. చూచినను ఫ్రెంచి ప్రజా ప్రభుత్వము విపత్పరంపరలలో చిక్కి కొనియున్నది.

4


1793 రాజ్యాంగ
విధానము

అతివాదులు జాతీయసభలో ముఖ్యులైరి. ఒక నూతన రాజ్యాంగవిధానమును తయారు చేసిరి. గొప్ప కుటుంబములో పుట్టినను, సామాన్యకుటుంబములో పుట్టినను, ఆస్థి యున్నను లేకున్ననూ, విద్య యన్నను లేకు న్నను, "దేశములోని ప్రతిమనష్యుడును -ప్ర త్వములో సమాన భాగస్వామియని వీరి సిద్ధాం తము. ఇదే రూసో పండితుని మతము. ఈ సిద్ధాంతమును బట్టి యాస్థి గాని విద్యగాని యుండవలెనను నిర్బంధము లేక యం దరు పౌరులకును ఎన్నుకొను హక్కు నిచ్చిరి. ప్రతి సంవత్సరము శాసనసభను ప్రజలెన్ను కొనవలెను. ఎప్పటికప్పుడు శాసన సభ్యులు ప్రజాభిప్రాయము ననుసరించి నడుచుకొనుట కే ప్రతి సంవత్సర మెన్నికలు పెట్టిరి. ఎన్నుకొను వారు స్వయము గా శాసనసభ్యుల నెన్ను కొనెదరు. ఎన్ను కొనువారి (వోటర్ల) సంఘము లేర్పరుపబడును. ఈసంఘములవారు సంవత్సరము లోపల ఇష్టము వచ్చినపు డెల్ల సమా వేశమై శాసనసభలోని తమ ప్రతినిథులు నడుచుకొనవలసిన పద్ధతులను తీర్మానించు చుండును. వీరు తమప్రతినిధులను రాజీనామా నియ్య వలసినదని కోరిన చో శాసన సభ్యులు రాజీనామా నియ్యవలెను. వోటర్ల సం ఘముల సలహాల ననుసరించి శాసనసభ్యులు సంపూర్ణముగా నడుచుకొనవలెను. ఇది 1793 సంవత్సరపు రాజ్యాంగ విధాన ము, నలుబదినాలుగు వేల మ్యునిసిపలు సంఘముల ప్రతినిధులు