పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
244

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

యాధిపతుల యెదుట విచారణకు "బెట్టిరి. “ నేను ప్రజాస్వామ్య మును కోరుచున్న దాననే. వేలకొంది ప్రజలను సంరక్షించుట కీదుర్మార్గుని చంపితిని. అమాయుకులను కాపాడుట కీద్రోహిని నాశనము చేసితిని. నా దేశమునకు శాంతి నిచ్చుట కీయడవి మృగమును వధించితిని,” యని యామే మిగుల ధైర్యముతో చెప్పెను. ఆమెకు మరణదండన విధింపబడెను. మారటు చని పోయిన తరువాత ప్రజలకొరకు ప్రాణములర్పించిన ధీరుడని ఆయని యందు ప్రజల గౌరవ మతిశయించెను .

తిరుగుబాటులు.

ఇంతలో లైన్సు, మార్సెల్సు, బోర్డో పట్టణములును అరువది రాష్ట్ర ములును తిరుగుబాటు చే రెను. రాజరికపు పక్షవాదులుకూడ తిరుగు బాటులను పురిగొలిపిరి. సైన్యములు తయారయ్యెను. సార్డీనియా ప్రభు వు వీరికి సహాయమును బంపెను. టూలూను, నైమ్సు మాంటు బాన్ పట్టణములును వీరితో చేరెను. జూన్. 6 వ తేదీన నలుబది వేలమంది తిరుగు బాటుదారుల సైన్యములు లా వెండి నుండి బయలు దేరి నామూరును పట్టుకొనెను. తరువాతనాన్ టెన్ సు మీద పడెను. బయట శత్రుమండలి వారు పెరినీసు వద్ద ఫ్రెంచి సైన్యముల నోడించి వాలన్ షీను, కాండీలను స్వాధీనపర్చుకొనిరి. మైన్సు పట్టణము శత్రువుల వశ మయ్యెను.ప్యారిసులోను, 'రాష్ట్రములలోను కరపు బాధ అధిక మగుట చూచి, ఇంగ్లీషు వారు ఫ్రాన్సుకు సముద్రముమీద నాహార సామగ్రులు రాకుండుటకైట సముద రేవులను ముట్టడించిరి, ఎటు