పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

243

పదునాఱవ అధ్యాయము

(3)

మారటు యొక్క
హత్య,

గిరాండిస్టులలో కొందరు ఖయిదులో నుండిరి. కొం దరు దేశమును విడిచి పారిపోయిరి. "పేషన్ మొదలగు కొందరు రాష్ట్రములకు బోయి. జాతీయ ప్రభుత్వము పై తిరుగు బాటులు చేయించిరి . ఎర్రీలోను, కైను లోను స్థావర మేర్పఱచుకొనిరి. బ్రిటనీ వీరితో చేరెను. సైన్యములను పోగుచేసికొని 'ప్యారిసు మీద దండెత్తవలెనని యత్నించుచుండిరి. ఆ వైపుల నున్న యతివాదులను ఖయిదుచేసిరి .. ఇచటనుండి యొక ధైర్యశాలి యగు యువతి, మిగుల సౌందర్యవతి, చార్లెటికార్డి యనునామె, జూన్ 2 వ తేదీన గిరాండిస్టులను వెళ్లగొట్టిన వారిలో ముఖ్యు డగు మారటును చంపుటకు బయలు దేరెను. మారటు సుప్ర సిద్ధ వైద్యుడు. ఎం. డి. పరీక్షలో తేరినవాడు. అతివాదులలో కెల్ల పలుకుబడిగలవాడు . "ప్రజా స్నేహితు” డను పత్రికకు సంపాదకుడు. ప్యారిసు జుల కీయనయం దత్యంత గౌరవము గలదు. గొప్ప రక్తపాతము లేనిది. స్వతంత్రము స్థాపించబడ నేరదని ఈయన సిద్ధాంతము.మారటు జబ్బుగా నుండుటవలన యూవిరిస్నానము చేసి కూర్చుండి యుండిగా గిరాండిస్టు కుట్ర లను గూర్చిన కొంత సమాచారము తెలుపుటకు వచ్చితిని చార్లెటి కబురంపి లోనికి వచ్చుటకు అనుజ్ఞపొందినది. లోనికి వెళ్ళినది. కొంత సమాచారము మారటుడు చెప్పినది. "ఆమె చెప్పుచున్న దాని నాయన జాగత్తగా వ్రాసికొనుచుండెను. ఈసమయమున తాను తెచ్చియున్న కత్తితో ఆమె మార టును పొడిచి చంపెను. వెంటనే ఆమెను పట్టుకొనిరి. న్యా