పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
242

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము


వలయుననియు వెంటనే విచారణ సంఘమును రద్దుపర్చవలసిన దనియు జాతీయసభ వారిని కోరిరి. వేలకు వేలు ప్యారిసుప్రజలు జాతీయసభను చుట్టుకొనిరి. “ఇటువంటి యల్లరులు చేసినయెడల ప్యారిసు పట్టణమును నాశనము చేసెదమని జాతీయ సభాధ్య క్షుడు చెప్పిన దానిమీద ప్రజలయాగ్రహము మరింత హె చ్చెను. అల్లరికి మేర లేదు. కొంతమంది గిరాండిస్టులు సభను విడిచిపోయిరి. మిగిలిన జూతీయ సభ్యులు ప్రజల కోరికలను మన్నించి హెబర్టు మొదలగు వారిని విడిచిపుచ్చుటకును విచా రణసంఘమును రద్దుపరచుటకును తీర్మానించిరి.


మరునాడు జాతీయసభకు గిరాండిస్టులందరును హాజరై కిందటిరోజున చేసిన తీర్మానమును రద్దు పఱచి తిరిగి విచా రణసంఘమును నెలకొలిపిరి. జాతీయ సభ పై ప్ర ప్రజలలో తిరుగు బాటు ప్రారంభ మయ్యెను. జూన్ 2వ తేదీన యెనుబది వేల మంది ప్యారిసుప్రజలు జాతీయసభను ముట్టడించిరి. వెంటనే గిరాండిస్టు ప్రముఖుల సందరను ఖైదు చేయ సలసిసదని కోరిరి. “ఇరువదు నలుగురు దేశద్రోహులను మా కప్పగించవలె” సని ప్రజల నాయకుగు హెన్రియట్టు కోరెను, ఈ కల్లోలములో సగము మంది జాతీయ సభ్యులు లేచిపోయిరి. అతివాదసభ్యులీ కుట్రలో చేరియుండిరి. మిగిలిన గిరాండిస్టులు భయపడిరి. అతి వాదసభ్యు లిచ్చిన జాబితా దాఖలా ఇరుపది మంది గిరాండిస్టు లను ప్రజలు ఖైదు చేయుటకు హాజరుండిన జాతీయ సభ్యులనుగ్న నిచ్చిరి. ఆ ఇరువదినలు గురును వారివారి యిండ్లలో సుండగా ప్రజలు ఖైదు చేసిరి. ప్రజ లంతటితో తృప్తినొంది వెళ్ళిపోయిరి.