పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొదటి అధ్యాయము

11

కాగూడదను ఆశపుట్టెను. తాను రాజు కాగలడు. అడ్డము వచ్చు వారు లేరు. కాని రాజు యొక్క బిరుదము ఒక విధమగు 'ప్రత్యేక గౌరవముగ చూడబడుచు వచ్చినది. అందువలన క్రై స్తవ ప్రధానమతాచార్యుని అనుజ్ఞను పొందనెంచెను. తాను రాజ బిరుదమును ధరింతునాయని సలహా నడిగెను. ' ప్రధాన మతాచార్యుడు నిజమైన అధికారము చలాయించువాడే రాజు గాన పిప్పిన్ రాజబిరుదము ధరించుట న్యాయ మేనని చెప్పె ను. మెటనే రాజగు మూడవ పిల్టరిక్కును తీసి వేసి క్రైస్తవ మతములో ప్రవేశ పెట్టి పిప్పిన్ రాజుగా పట్టాభిషిక్తుడయ్యెను. రెండుసంవత్సరముల తరువాత పోపు స్వయముగా పారిసుకు వచ్చి పిప్పిన్ కు తేనహస్తములతో కిరీటధారణగావించెను. పిప్పీన్ వంశమువారు అడ్డు లేకుండ ఫ్రాన్సునకు రాజులుగ పాలించిరి. 768 సంవత్సరమున పప్పిన్ చనిపోయెను.