పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రెంచిస్వాతంత్ర్యవిజయము


రెండవ అధ్యాయము

సార్ల మేను చక్రవర్తి

షార్ల మేను చక్రవర్తి

షార్లమేను

ఫ్రాన్సు దేశము యొక్క పూర్వరాజులలో షార్ల మేను చక్రవర్తిక న్న సుప్రసిద్ధులు లేరు. షార్ల మేను ప్రెంచివారి కెంత ముఖ్యుడో జర్మనులకు కూడ నంతే ముఖ్యుడు. ఈయన పిప్పిన్ రాజుయొక్క కుమారుడు. పిప్పిన్ చనిపోయిన తరువాత రాజ్యభారమును వహించెను. షార్ల మేసు కూడ తక్కిన ఫ్రాస్కులవ లెనే జర్మను భాష మాట లాడువాడు, మధ్యమ యుగములో యూరఫుచరిత్రలో నీయన పాలనము మిగుల ప్రాముఖ్యతను వహించినది. తన రాజ్యములో జర్మనీని చేర్చుకొని జర్మనీ కై క్యతను కలుగ చేసెను. ఇటలీని జయించి స్పెయినులో కొంతభాగ మాక్ర