పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
10

'ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

యొక్క. సహాయము కోరగ నాయన ఫ్రాన్కుల సైన్యము లను 783 వ సంవత్సరమున ముసల్మానుల పైకి నడపెను. టూర్పువద్ద క్రైస్తవ సేసలుసు ముసల్మాను సేనలను తారసిల్లెను : దినమంతయు యుద్ధము బహు తీవ్రముగా జరిగెను. ఉభయు పక్షముల వారును మతావేశముతో పోరాడిరి. కానీ ముస ల్మానుల కెక్కువ నష్టము కలిగినఁదుస ఆ రాత్రి ముసల్మానులు యుద్ధభూమి విడిచి వెనకకు మరలిపోయిరి. ఛార్లెసు మార్టలు వారిని వెంబడించి వారు స్వాదీనము పొందిన ప్రతిపట్టణమును తిరిగి స్వాదీనము పొంది ఈ ప్రాన్సు యొక్క నైరుతి సరిహద్దగు పెరిన్నీ పర్వతములవరకును "దేశమంతను తిరిగి జయించెను. మహమ్మదీయులు పెరిన్నీసు కొండలు దాటి తిరిగి స్పెయిను లో ప్రవేశించిరి. ఈ విధముగా , కార్లెసుమార్టెలు ఫ్రాన్సు దేశము ను కాపాడెను. 741 న సంవత్సరమున ఆయన చనిపోయెను. ఆయన కుమారులగు కాల్లిమాన్, పిప్పిర్లు ఫాన్సను పంచుకొనిరి. ఫాన్సయొక్క ఐఖ్యత చెడునట్లు కనబడెను. కొలది కాలములో కార్లో మాను తన భాగమును త్యజించి తన ఆత్మాభవృద్ధి కొరకైక్రైస్తవమత ప్రవేశము చేసెను. 747 వ సంవత్సరము నుండియు పిప్పిన్ ఒకడే యావత్తు దేశముయెక్క రాజ్యాధికారమును చలాయించెను.


మేయర్లు రాజులగుట

రోములో నున్న క్రైస్తవ ప్రధాన మతాచార్యులగు పోపుకు పిప్పీన్ చాల సహాయము చేయుచుండెను. పిప్సిన్ పది సంవత్సరముల కాలము మేయ రుగ దేశమును పాలించెను.ఇంతలో నితనికి తానే రాజు