పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొదటి ఆధ్యాయము

వాత ఆయన అధికారము కుమారుడగు ఛార్లెసు మార్టిలుకు సంక్రమించెను. నామమా త్రావశిష్టుడగు రాజు పేర ఛార్లెసు 'మార్టిలు యావత్తు రాజ్యాధి కారమును వహించి మిగుల సుప్ర సిద్ధుడై , ఫ్రాన్సు దేశపు సరిహద్దులను రైసునదికి తూర్పున గొంతదూరమువరకు విస్తరింప జేయుటయే గాక తన రాజ్యము లోని ప్రభువులనుసామంతరాజులను అణచిరాజు యొక్క అధికారమును బలపరచెను.. క్రైస్తవమతమునకును రోము లోని క్రైస్తవ ప్రధానమతాచార్యునికిని (పోపుకును); చేయూత నొసగెను.

మహమ్మదీయులతో యుద్ధము

732 వ సంవత్సరమున చార్లెసు మార్టెలు మహ మ్మదీయులను టూర్సు యుద్ధములో నోడించెను. మహమ్మదీయులు 640 వ సంవత్సరమున ఈజిప్టును జయించిరి.. ఈ సంవత్సరమున కార్తెజుని స్వాధీన మును పొంది ఉత్తర ఆప్రికానంతను ఆక్రమించుకొనిరి. 711 వ సంవత్సరమున స్పెయిన్ . దేశ ముసు జయించి రాజ్యమును స్థాపిం చి యుండిరి. కొలది కాలములో పెరినీసు పర్వతములను దాటి ఫ్రాన్సులో ప్రవేసించి కొన్ని పట్టణముల స్వాధీనమును పొం దిరి. ఇంద్దు మీద క్రైస్తవ పంచములో సంక్షోభము జనిం చెన. మహమ్మదీయలు ఫ్రాన్సును జయించి క్రైస్తవ నాగ రికతను నాశనము చేయుదురను భయము. పుట్టెను. ఫ్రాన్సులోని ఆక్విటైన్ మండలములో మహమ్మదీయులు ప్రవేశించగ ఆమం డల ప్రభువు పారిపోయెను. అంతే ముసల్మానులు లాయిరు నదీ ప్రాంతము నాక్రమించిరి. ఆమండల ప్రభువు ఛార్లెసుమార్టిలు