పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ప్రెంచిస్వాతంత్ర్యవిజయము

పదునేనవ ఆధ్యాయము

రాజునకు మరణదండనము విధించుట

(1)

సంపూర్ణ ప్రజా
స్వామ్యము,

1792 సంవత్సరము సెప్టెంబరు నెల 21 వ తేదీన నూతన జాతీయసభ సమావేశ మయ్యెను. మితవాదులెన్నికలకు నిలువ బడనే లేదు. వారి యాజమాన్యముననుండిన ఫూలెంటు క్లబ్బు మూయబడినది. కొంత మంది మిత వాదులు దేశమును వదలిపోయిరి. కొంతమంది దేశములోనుండి తిరుగుబాటులను పురికొల్పు చుండిరి. జాతీయసభలో కుడి వైపున గిరాడిస్టులును, ఎడమ వైపున మాంటీనార్డులును, మధ్య నేక క్షకిని చెందనివారును కూర్చుండి యుండిరి. ఎడమ కక్షికి చెందినవారిలో రాబిప్పీయరు, డాంటన్, మారటు మొదలగువారు ముఖ్యులు. ఎక్కువ రాష్ట్రములు గిరాండిస్టులనే యెన్నకొ నెను. కాని అతవాదు