పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
220

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

లగు మాంటి నార్డులకు ప్యారిసుప్రజలలోను, మ్యుని సిపాలిటీలో సు పూర్తిగా పలుకు బడి గలదు. జెకోబిన్ క్లబ్బులును వీరి యా జమాన్యముననే యున్నవి. జాతీయ సభ కూడగనే, రాజును తీసి వేసి ఫ్రాన్సు దేశమును సంపూర్ణప్రజాస్వామ్యముగ (రిపబ్లిక్కుగా) చేసిరి. సెప్టెంబరు 22 వ తేదీనుండియు, నూతన శకప్రారంభ మగునట్లు ప్రకటించిరి. ఫ్రాంన్సు యొక్క పంచాం గములో ప్రధమ సంవత్సర మా తేదీనుండి. ప్రాంభ ముసు చేయించిరి.

రెండు కక్షల కును తగాదాలతో ప్రజాస్వామ్య ప్రభు త్వము ప్రారంభమయ్యెను. ఈ రెండవ తేదీన ప్యారిసు లో హత్యల, గావించిన వారిని ఆత్మ హత్యల ప్రోత్సాహకులను శిక్షించ వలెనని 'రాండిస్టులు తీర్మానమున బెట్టిరి. ఉద్రేక 'సమయములలో నట్టివి .జారుగక మానవనియు ఎవరిని శిక్షింప "బనిలేదనియు అతివాదులు ఖండించిరి. అతివాదనాయకులగు రాబిస్పయరుమారటుగారులె హత్యలు చేయుటకు పోత్సా హకులని రెండవకక్షి వారు నిందించిరి. తుదకు ఏమియు తేల కయే జాతీయసభ వారు హత్య లవిషయము విడిచి పెట్టిరి. ఉభయ కక్షల మధ్య మనస్తాపములు పెరుగుచుండెను. ఎక్కువసంఖ్యా కులగు గిరాండిస్టులనుండియే మంత్రు లేర్పడిరి. గిరాండిస్టు నెటులయిన కూలదోసి తా మథికారములోనికి రావలెనని యతివాదులు తలంచిరి. అతి వాదులు ప్యారిసు ప్రజలుగుంపుల యుద్రేకము మీదను - జెకోబిను క్లబ్బు మీదను ఆధారపడి యుండిరి, గిడాండిస్టులు అనుభవజ్ఞులును విద్వాంసులును గొప్ప