పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
218

ఫ్రెంచిస్వాతం త్య విజయము

క్షిణ్యముగ చంపి వేసి.. ప్రజల యావేశము ముందఱ శాసనసభ యేమియు చేయు లేకుండెను . డెమరో సేనాని ఫ్రెంచి సైన్యము లను తీసికొని శత్రు సైన్యము. మీదికి వెళ్ళెను . శత్రు సేనాని యగు బ్రన్సువిక్కు ప్యారీసుమీదికి నెకాయెకి వచ్చుటకు సందేహించెను. మ్యూజులకోటను పట్టుకొనుటకై వెడలుచుం డెను. త్రోవలో వాల్మీయొద్ద ప్రెంచి సైన్యములు శత్తృవుల నెదుర్కొనెను.ఫ్రెంచి సైనికుల సంఖ్య తక్కువగానున్నను దేశాభిమాసపూరితు లై పోరాడి శత్రువులను పూర్తిగ నోడిం చెను. లూయీ రాజును పేరునకు రాజుగా చేసినన చాలునని ప్రష్యా వారు సంధి రాయబారముల సంపగా ప్రష్యా సైన్యము లు పూర్తిగా ఫ్రెంచి దేశము పదలి వెళ్ళినగాని ఎట్టి రాజీనామా మాటలను మాట్లాడుటకే వీలు లేదని ఫ్రెంచి ముప్రభుత్వము వారు జవాబు చెప్పిరి.. తిండి లేక బాద పడి, రోగములచే పీడింపబడి, ప్రష్యా సైన్యములు సెప్టెంబరు 30 వ తేది నుండియు ఫ్రాన్సును వడలి వెళ్ళిపోయిరి. ఫ్రెంచి సైనికులు వర్డన్ లాంగులీని స్వాధీనం పచుకొనిరి. ఆస్ట్రియనులు చిలీని ముట్టడించగా వారిని ఫ్రెంచి సైన్యములు తరిమి వేసెను. వాల్మీభయము వలన ఫ్రెంచి విప్లవము కాపాడబడెను. ఆ జయమను పొందిన మరుసటిదినమున నే ప్యారిసులో జాతీయ సభ వారు రాజును శాశ్వతముగా పదభష్టునిచేసి సంపూర్ణ ప్రజాస్వామ్యమును ప్రకటించిరి,