పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
208

ఫ్రెంచి జ్వాతంత్ర్య విజయము


నూతన రాజ్యాంగవిధాన ప్రకారము ప్రాత జాతీయ సభ్యు లెవరును నూతనశాసనసభలో సభ్యులుగా నెన్ను కొన బడుటకు వీలు లేదు. ఇది మంచి యేర్పాటుగాదు. అనుభవ శాలురు రాకుండబోయిరి. స్టేట్సుజనరలులలోను, జాతీయ సభలోను నిరంకుశత్వమును ప్రభువుల హక్కులను సంరక్షించ యత్నించిన ప్రభువులు, మతాచార్యు లుండిరి. అట్టివారెవరును నీ నూతన శాసనసభలో లేరు. ప్రజల యెన్నికలలో నట్టివారికి తావు లేదు. జాతీయసభలో మధ్య నుండి నకక్షివారు నూతన శాసనసభలో కొంతమంది మితి వాదక క్షిగసు, తెక్కి సవారు గిరాండిష్టులుగను చీలిరి. అతివాదుల కెక్కువబలము గలిగెను. శాసనసభలో అధ్యక్షునికి కుడి వైపున మితవాదులు కూర్చుండిరి. గొప్ప వీరి కెడమపక్కన గిరాండిష్టు లుం డిరి. గొప్ప విద్వాంసులగు బ్రోస్సో, వేసర్డు గెన్సోన్, మొదలగువారు వీరి నాయకులు, సభలో నెడమవైపున సంపూర్ణ ప్రజాస్వామ్య మును గోరుచున్న అతివాదులు కూర్చుండిరి. వీటికి మాంటి నార్డులని పేరు. యౌవనము, తీవ్రవాదము, మంచిపక్తృ త్వము, వీరికి ప్రధానలక్షణములు.అటునిటు నూగులాడు చుండినవారు మధ్యకూర్చుండి యుండిరి. ఎటు బలముగానున్నప్పు డటు చేరుచున్న వారు ప్లెయిన్ అని వీరికి పేరు.

2

క్లిష్ట పరిస్థితులు

శాసనసభకు ప్రథమమునుండియు గొప్పకష్టము లెదు ర్కొనెను. జాతీయసభ పదలిపోయిన శత్రువుల బాధ దినదిన మున కెక్కువయ్యెను. దేశమును వదిలిపోవువా రిసంఖ్య విశేషుగా హెచ్చెను. సైనికోద్యోగు