పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



ప్రెంచిస్వాతంత్ర్యవిజయము

పదునాలుగవ అధ్యాయము

సంపూర్ణ ప్రజాస్వామ్యము

(1)

నూతన శాసనసభ

లెజిస్లేటివ్ అసెంబ్లి (శాసనసభ) 1791 సంవత్సరము 1 వ అక్టోబరు తేదీన సమావేశ య్యెను. పరాసు దేశ స్వాతం త్యమున కై పనిచేయుచున్న వారియందు గౌర. వముతోను ఇంతవరకేర్పాటు కాబడిన పద్ధతినే పోవలెనను కోరిక తోసు పని ప్రారంభించెను. జాతీయ సభవారు చేసిన రాజ్యంగవిధానము వ్రాయబడి. యున్న పుస్తక ముసు పండెండుమంది వృద్ధ ప్రతినిధులు తెచ్చిరి.. శాసన సభ్యు లెల్లరును లేచి నిలువబడి టోపీలుతీసి 'స్వాతం త్యమున కై బ్రదుకుదుము. లేని యెడు మరణింతుము' అనుశప థమును దీసికొనిరి.