పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

.

206

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

ముగా నుండవచ్చునని ప్రకటించిరి ఫ్రెంచి ప్రజల కందరకును స్వాతంత్యము గలిగి, సోదర భావము ఐకమత్యము ప్రబలి, ఫ్రాన్సు దేశము వర్ధిల్లు వలెననికోరిరి. అధ్యక్షుడగు ధూరే గారు "జాతీయసభ తనయొక్క యుద్దేశ్యమును నెరవేర్చి దాని సమావేశములు ఇంతటితో ఆఖరై నవి" అని బిగ్గరగా చెప్పెను. ప్రేమపూరితమైన కోలాహలముతో 'ఫ్రెంచి జాతియొక్క పథము: జాతీయసభ ముగిసెను. రెండు సంవత్సరముల కాలములో నీయాదర్శపద మైనసభ, నిరం కుత్వమును నిర్మూలనము గావించి,జాతి భేదములను రూపు మాపి, ప్రజల రాజ్యమును స్థాపించెను. ప్రజలను బాధించు చున్న ప్రతిష్టాపన లెల్ల తీసి వేసి, ప్రజలలో సమానత్వము, న్యా యము నేర్పరచి, ప్రజాభివృద్ధి కారక మగు పెక్కుపనులను గావిం చెను. గొప్ప ఫ్రెంచి జాతిని నిర్మాణము గావించెను. ఉతృష్ట మైన సిద్ధాంతములను లోకమునకు ప్రకటిం చెను. "జాతీయత కుసు, స్వయంనిర్ణయమునకును, ఫ్రెంచి జాతిని ప్రపంచమునకు మార్గదర్శకము.గా చేసెను. ఇట్టి ఘనకార్యము నింతశీఘ్రకాల ములో ముగించిన జాతీయసభ మానవచరిత్రలో మరియెచ్చ టను లేదు.