పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

209

పదునాలుగవ అధ్యాయము

ఇంకా లుకూడ దేశమును ఎదలి వెళ్ళసాగిరి. ప్రభువులు వెళ్ళి వీరితో చేరిరి.. సరిహద్దు సున్న పటాలములు కొన్ని దేశ భ్రష్టులతోకలి . సెను. దేశములోనుండి దృఢ చిత్తము లేని వారిని, ప్రభువులు తిరిగి యధికారములు పొందగనే, వీరిగతి యేమినుగునో ఆలోచించు కొనుమని వర్తమానములంపుచుండిరి. జర్మసురాష్ట్రములలోను ఆస్ట్రియాలోను. ఫ్రెంచి దేశ బ్రష్టులగుంపులు చేరి ఫెంచివిష్ణ వ మును నాశనము చేయుటకు సిద్ధపడు చుండిరి, యూరపులోని రాజులు వీరికి తగుర క్షణను, సహాయము నిచ్చుచుండిరి. వీరిరా యబారులను రాజు లాదరించుచు, ఫ్రెంచిప్రభుత్వపు రాయబా రులను అగౌర వపరచి వెళ్ళగొట్టిరి.. జాతీయ వాదులగు ఫ్రెంచివ ర్తకులకును బాటసారులకును, యూరపులో ప్రతిచోటను మిగుల నిబ్బందులు కలుగ జేసిరి. ఫ్రాన్సులో సున్న పోపు పక్షపు మతా చార్యులు ప్రజలను జాతీయ ప్రభుత్వము పై మతము పేర వురి గొల్పి తిరుగుబాటును చేయించుచుండిరి.

దేశభ్రష్టుల
మీద నిర్బంధము

విదేశములకు పోకుండ నిర్బంధములు కలుగజేయుటకు శాసనసభ వారు సమకట్టిరి. కొంత తీవ్రముగుచర్చ జరిగెను. మితవాదు లా క్షేపించిరి. ముప్పదియవ అక్టో'బరు తేదీన రాజు యొక్క జ్యేష్ఠ సోదరు డగు లూయీస్టానిలా ప్రభువు రెండు నెలలలోఫ్రాన్సుకు తిరిగిరానియెడల, రాజకుటుంబము నాయనకుగల సమస్తహక్కులు పోవునిని శాసించిరి. సవంబరు 9 వ తేదీన ఫ్రాన్సును ఎగలి విదేశ సరిహద్దులలో ప్రోగగుచున్న వారందఱును దేశద్రోహులనియు, 1792 నం