పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

204

పదమూడవ అధ్యాయము

స్వయముగా జాతీయసభకు వచ్చెను. రాజ్యాంగవిధానము సంగీక రించెను. ప్రజలు జే జే ధ్వానములు సలిపిరి. జాతీయసభ్యు 'లమితోత్సాహపరవశులైరి. అదినమున రాజు ప్రజల యొక్క -- విశ్వాసమును గారవమును తిరిగి పొందెను. నూతన రాజ్యంగ విధానమును బట్టి నూతన శాసనసభలెజిస్లేటివ్ ఎస్సంబ్లి) అక్టో బరు 1వ తేదీన సమావేశ మగును. కావున సెప్టెంబరు 29 వ తేదీన జాతీయసభ యొక్క యాఖరుసమావేశము జరిగెను. రాజు హాజరయ్యెను. గంభీరోపన్యాసమును జేసెను. "సభ్యు లారా! మీరు చాలకష్టపడి యనేక దేశపయుక్తమయి చట్టములను చేసియున్నారు. మారిండ్లకు వెళ్లినప్పుడు మీరు చేయవలసిన కార్య మొకటి గలదు. ఈ చట్టముల నిజమైన యు ద్దేశ్యములను మీతోడి పౌరులకు చెప్పి, వినని నిర్లక్ష్యము చేయువారిని మందలించుటయు, మీప్రే వల్లను రుజు ప్రవార్త నవల్లను దేశములోని వివిధాభిప్రాయములు గలవారినెల్ల నేకీభవింపజేయుటయు నై యున్నది. మీరాజు ప్రజలకు నెల్ల ప్పుడును విశ్వాసపాత్రుడైన స్నేహితులుగా నుండునని వారితో చెప్పుడు. ప్రజల ప్రేమనే గోరుచున్నా సనియు, ప్రజలపౌఖ్యమే నాసౌఖ్యమనియు, ప్రజలకు మేలుచేయుటవలస మాత్రమే నాకు తృప్తికలుగుననియు, మీతోడి పౌరులలో చెప్పుడు" అని రాజు సభ్యు లహర్ష ధ్వనుల మధ్య అంత్యోపన్యాసమును . చేసె సు. జాతీయసభవారు అదివరకు రాజుకు పారి పోవుటకు పోవుటకు ప్రోత్సహించిన వారిమీద బెట్టబడిన నేరారోపణలన్నియు నెత్తి వేసిరి. దేశ భ్రష్టులైనవా రెల్లరును తిరిగి దేశమునకు వచ్చి సౌఖ్య