పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
204

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

రాజులు సభ్యు లేమి, నిరుత్సాహపడుటకు మారుగ కోపోద్దీపితు లైరి. “మన దేశ వ్యవహారములతో నీ విదేశ రాజలు కేమిపని? ఒక గొప్పజాతికి సుత్తరువు లిచ్చుటకు వీరి కేమియధి కారము? మనజాతి యొక్క లాభ నష్టములు, మంచి చెడ్డలు, రాజ్యాంగ విధానములు మనమే నిర్ణం యించుకొనవలెనుగాని, యూరపు కేమిజోక్యము?” అని ప్రశ్నింపసాగిరి. వెంటనే ఫ్రాన్సు యొక్క సరిహద్దు లన్నియు సురక్షితముగ నుండుటకై తగు బందోబస్తును జేసిరి. ఒక లక్షజాతీయ సైనికులను తయారు జేసిరి. శత్రువుల ముట్టడికి బహు శాంతమనస్కులై సంపూర్ణ ముగ సిద్ధపడిరి. ఫ్రెంచి జాతి దేశాభిమానపూరిత మైయున్న ఈ సమయములో తమభూమిమీద ఎవరికిని జయింప నలవి గానిదని దృఢవిశ్వాసమును గలిగియుండెను.

10

జూతీయసభ
యొక్క ముగింపు.

జాతీయసభవారు నూతన రాజ్యాంగ విధానమును చట్ట ములను అన్ని టిని సరిజూచి, సెప్టెంబరు 14వ తేదీన 60 మంది ప్రతినిధులచే లూయిరాజు యొక్క దస్కతు నిమిత్తము పంపిరి. లూయి రాజు వానినన్నిటిని పరిశీలించి దస్కతు పెట్టెను. "నే నీ రాజ్యాంగ విధానము నంగీక రించుచున్నాను. నా దేశములో దానికి సం రక్షించుటకును, విదేశీయుల ముట్టడులనుండి కాపాడుటకును, వాగ్దదత్తము చేయుచున్నాను నాకున్న యావత్తు అధికారము లను వినియోగించి, దాని నమలులో బెట్టెద"నని రాజు జాతీయ సభకు ఉత్తరము పంపెను. మరుసటిదినము రాజు