పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
202

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

సంపూర్ణ ప్రజాస్వామ్య వాదులు దీనితో తృప్తినొందక ప్రజలలో నాందోళనమును పురిగొల్పిరి, మిరాబో చనిపో యిన తరువాత పేషన్, రాబిస్పీయరుల నాయకత్వము క్రింద జేకొబిన్ "క్లబ్బులు ఈకక్షి వారి పలుకుబడిలో చేరెను.జులై 17 వ తేదిన వెంటనే రాజును పదబ్రష్టుని చేయవసినదని జాతీయసభ వారిని కోరుచు, నొక మహజరును తయారు చేసి, ప్యారిసులోని షాండిమారు ప్రదేశములో కట్టబడియున్న వేదిక యొద్ద వేడు వేల దస్కృతులు చేయుచుండిరి. ప్యారిసు చుట్టు నున్న పల్లెలకు గూడ నీయాందోళనము వ్యాపించెను. జాతీయ సభ వారు, ప్రజలు గుమిగూడి దస్కృతులు చేయవద్దని "యుత్త రువులు చేసిరి . బాలీ బటులకును ప్యారిసు మ్యునిసిపాలిటికిని, ప్రజలగుంపులు ట్టవలసినదని యాజ్ఞాపించిరి. వీరు ప్రజలగుంపులను చెదిరిగొట్టగా ప్రజ లాగ్రహ వేశులై ఇంక నెక్కువగా చేరి దస్కతు చేయనారంభించిరి. లఫయతు సేనాని సైన్యములను తెచ్చెను. పోవలసినదని యుత్తరు విచ్చెను. ఆకాశమున కై తుపాకులను పేల్పించేను. ప్రజలు పోక రాళ్ళు రువ్విరి. అప్పుడు సైనికులను ప్రజలమీద కాల్చుట కుత్తురువు చేసెను. తుపాకులను కాల్చగా ప్రజలలో చాలమంది చని పోయిరి. చాలమందికి గాయములు తగిలెను. ప్రజలు పారి పోయిరి. ఈసంగతి జరిగిన తరువాత సంపూర్ణ ప్రజాస్వామ్య కక్షి యొక్క. పలుకుబడి ప్రజలలో నింకను ఎక్కువదృఢముగా నాటుకొనెను. జాతీయసభలోని మిత వాదనాయకుల పొర బాటు వారికక్షి యొక్క నిర్మూలమునకు తోడ్పడెను. ప్రజల