Jump to content

పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

201

పదుమూడవ అధ్యాయము

సహాయము లేదయ్యెను. దేశములోని ప్రజలందరును ఏకమై యుండి, తోవలో ఎపెర్నియెద్ద జాతీయసభ వారు పంపిన ముగ్గురు ప్రతినిధులు రాజును కలిసి ప్యారిసునకు తీసికొని పోయిరి. ప్యారిసునకు రాజకుటుంబము చేరగనే వేలకు వేల ప్రజ లు రాజుబండిని చుట్టుకొని. "రాజునకు గౌరవము చూపిన వారికి దెబ్బల శిక్ష విధించబడును. రాజు నవమానపరచినవారికి మరణదండన నియ్యబడు" నని ప్యారిసు పురపాలక సంఘమువారు ప్రచురించి యుండిరి. ప్యారిసు ప్రజలు నిశ్శబ్దముగాను శాంత చిత్తముతోను రాజును చూచి వెళ్ళిరి. తిరిగి రాజకుటుంబమును రాజును ట్యూలరీమందిరములో నుంచబడిరి. ఎక్కువ బందో బస్తుగా కాపుదల చేయబడెను .


రాజు నీమిచేయవలెనని జాతీయ సభలో తీవ్రముగా, చక్చజరిగెను. ఇంతటినుండియు రిపబ్లికను పార్టీ (సంపూర్ణ ప్రజాస్వామ్యక క్షి) ముందుకు వచ్చెను. వెంటనే రాజును పద బ్రష్టునిచేసి విచారణ చేయవలసినదనియు, రాజు లేని ప్రజా ప్రభుత్వమును స్థాపించవలెననియు వీరు కోరిరి.గోడల మీద రిపబ్లికు కావ లేదని పెద్ద శాగితముల నంటించిరి. కాని ఎక్కువ మంది సభ్యులు రాజును తీసి వేయుటకు సమ్మతించ లేదు. తొం దర పడపద్దనియు పేరునకు రాజుండుట వలస జాతికి నష్టములే దనియు బార్నిల్ గంభీరోపన్యాసము గాంచెను. ఇప్పటికై సను రాజు నూతన ప్రభుత్వ విధానము సంగీకరించకపోయిసను, ఫ్రెంచి జాతికి విరోధులగువారితో చేరినను, జాతికి వ్యతిరేక ముగ సైన్యములను పోగు చేసినను రాజ్యమును కోల్పోవునని తీర్మానించిరి.