పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/214

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

203

పదుమూడవ అధ్యానము

మీద నిర్బంధములు ప్రయోగించినకొలదియు ప్రభుత్వము యొక్క బలము క్షీణించును. ఆదినమున చనిపోయిన ప్రజల రక్తము రాజశిరచ్ఛేదమునకు కారణమయ్యెను.

9

యూరపు రాజులు
ప్రకటనము.

లూయీ రాజును పట్టుకొని తిరిగి తెచ్చినారనువార్త ఫ్రాన్సు బయటనున్న రాజు యొక్క స్నేహిత కందరకును కలవరము గలిగించెను. రాజునకు సహాయము చేసిన బొయిలీ సేనాని కొంత సైన్యముతో 'దేశమును పదలి దేశ భ ష్టులలో చేరెను. దేశ బ్రష్టులు తమయాశలనన్నిటిని ఇంతటి నుండియు యూరపు రాజుల మీదనే పెట్టుకొనిరి. ఆగష్టు 27వ తేదీన ఆస్ట్రియా చక్రవర్తియు, ప్రష్యారాజును, ఆర్టాయి ప్రభువును, కలిసికొని యూరపు రాజు అందరితరఫున నొక ప్రకటనము గావించి,రి. తమ తోడి రాజగు పడునారవ లూయీ యొక్క గౌరవము తమదేననియు, ఆయన యిష్టము వచ్చిన చోటికి పోవు స్వేచ్ఛ యుండవలెననియు, నాయన సింహాసనము నాయ నకు యిచ్చివేసి జాతీయసభ అంతరించవలెననియు, ఫ్రెంచి ప్రభువులకు తమతమ ఆస్తులను, హక్కులను తిరిగి యిచ్చివేయవ లెననియు, నిట్లు " ఫ్రెంచిప్రజలు చేయనియెడల యూరపులోని రాజులందరును. ప్రాన్సు మీదికి దండెత్తివచ్చి లూయీ రాజు యొక్కయు, ఫ్రెంచి ప్రభువుల యొక్కయు హక్కులను సంపూర్ణముగా పునరుద్ధరింతు మనియు నాప్రక టనలో చెప్పబడెసు. దీనివలన ప్రెంచి ప్రజ లేమి, జాతీయ