పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
186

ఫ్రెంచిస్వాతంత్ర్య విజయము

పౌరహక్కులకును, నుద్యోగములకును అర్హులు. (6) దేశ ములో వర్తక స్వేచ్ఛ, పరిశ్రమల స్వేచ్ఛ నెలకొలుపబడెను. రహదారి సుంకములు, టోల గేట్లు తీసివేయబను. విదేశ వర్తక విలులో కొన్ని సరుకులమీద సుంకములు వేయబడెను. 7) ఫ్రాన్సు దేశములోని మతాచార్యుల ప్రతిష్టాపనలకును, మఠములకును పదికోట్ల సవరనుల ఆస్తి యుండెను. సాలుకు ముప్పదియైదులక్షల సవరనుల ఆదాయము వచ్చుచుండెను. ఈ ఆ స్తియంతయు జాతీయప్రఖత్వమువారు వశపరచుకొని, మతాచార్యుల కందరుకును జీతముల నేర్పరచిరి. మఠములను స్వాధీనపడచుకొని, వానిలోని సన్యాసులగు స్త్రీలకును, ఫురు షులకును, ఉపకార వేతనములనిచ్చి పంపి వేసిరి. {8} ప్రభుత్వ "బొక్క-సములో ధనము లేనందున, ప్రతివారును. తన ఆ స్తిలో నాలుగవ వంతు తెచ్చి యియ్యవలెనని జాతీయ నాయకుడగు మిరాబో కోరగ, మిక్కిలి యుత్సాహముతో ననేకు లాప్రకార ముగా తెచ్చియిచ్చిరి. ఇంతియె గాక రాజు యొక్క స్వంత భూములను, మతాచార్యులనుండి తీసికొన్న కొన్ని ఆస్తులను, దేశమును వదలి పోయినవారి సొత్తులను, కొంతవరకు జాతీయ ప్రభుత్వము వారు విక్రయించి షుమారు రెండుకోట్ల సవరను లను సంపాదించిరి. తత్కాలికముగా కొంతపరకు కాగితపు దవ్యమును (కరెన్సీనోట్లను) కూడ నిర్మించి సొమ్మును స్వీక రించిరి. న్యాయముగ ఆదాయమును బట్టి పన్నులు వేయబడెను . బాధకరముగ నున్న అన్ని పన్నులును తీసి వేయబడెను. దేశమంత టను ఒకేవిదమగు కొలతలుసు తూనికలుసు వాడుకలోనికి తేబ