పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

185

పదుమూడవ అధ్యాయము


స్సుగలిగి సాలు కొక రూపాయి పన్ను నిచ్చు. ప్రతివారికిని ఎన్ను కొను (వాటిచ్చు) అధికార మేర్పడెను. మ్యునిసిపల్ సభ్యుడగు వాడు ఆరుపాయల పన్నును,జాతీయశాసనసభలో సభ్యుడగు వాడు ముప్పది పాయలవన్నును చెల్లించువాడుగ నుండ వలెను. ఎన్ని కాధికారముగలవా రందను (వోటర్లందురును) జాతీయ సైన్యములో చేరితీరవలెను. (3) కార్యనిర్వాహక శాఖ (texecutive), విచారణ శాఖలు (judicial) వేరు చేయబడెను. న్యాయాధిపతులు పదిసంవత్సరముల కొక సారి ఎన్నుకొనబడ వలెను. జ్యూరి విచారణ హక్కు క్రిమినల్ కేసు లన్నిటిలో నేర్పాటు చేయబడెను. శాసనము అందరును సమానముగ వర్తించునట్లును, ఏమనుజునిగాని సరియైన విచారణ లేకుండ ఖైదులో నుంచకుండునట్లును చేయబడెను. (4) పీనల్ కోడ్డు (శిక్షాస్మృతి) లో ముఖ్యమైన మార్పులు చేయబడెను. ప్రతి మనుజుడు తసయిష్ట మయిన మతము నసలంబించ వచ్చును. మతవిశ్వాసముల కెట్టిశిక్షయు నుండదు. మరణశిక్ష చాల నేరములకు తీసివేయబడెను. ఏనేరమునకుగాని నేరస్థునియావ దాస్తిని ప్రభుత్వము వారు తీసికొనగూడడు. నేరస్థునికే శిక్ష విధించవలెను గాని, అతని కుటుంబము బాధపడగూడదు. వాక్స్వోతంత్యము పత్రికా స్వాతంత్యమును నిర్బంధించు చట్ట ములన్నియు రద్దుపరచబడెను. (5) అన్ని మతముల వారుసు, అన్ని యుద్యోగములకును అర్హులుగ చేయబడిరి. వెనుకటి ప్రభు త్వము వారు ప్రొటెస్టెంటు మతస్థులనుండి బలవంతముగ తీసి కొనిస ఆస్తి తిరిగి యిచ్చి వేయబడెను. యూదులుకూడ సమస్త