పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

187

పదమూడవ అధ్యాయము

డెను. ప్రజలు మిక్కిలి సంతోషముతో గౌరవోద్యగములను స్వీకరించిరి. ప్రభుత్వముసకు మిగుల తోడ్పాటు గావించిరి. (9) జూన్ 26 తేదీన బిరుదములు, నైటుహుడ్డులు (సర్ బిరుద ము వంటివి), పతకములు, ఫిరంగులు కాల్చుట, పతాకము లెత్తుట మొదలగు దంభ చిహ్నము లెల్లను తీసి వేయబడెను...

(3)

ఫ్రెంచి విప్లవము
యొక్క సంవత్స
రోత్సవము.

1790 వ సంవత్సరము జులై 14: తేదీన ఫ్రెంచి విప్ల వము యొక్క ప్రధమ సంవత్సరోత్సవమును, పరాసు ప్రజలు ప్యారీసులోని శాండిమార్ మైదానములో ఆ త్యుత్సాహములో జరిపిరి. ఫ్రాంన్సు దేశము యొక్క వివిధ భాగములనుండియు నొకలక్ష మంది ప్రతినిధులు సమావేశ మయిరి. లూయి అధ్యక్షత వహించెను. ప్రధాన సేనాని లఫహయతు జాతీయసభవారు నూతనముగా నేర్పరచిన రాజ్యాంగ విధానమునకు లోబడి నడుచుకొందునని ప్రమా ణముచే సేసెను. వచ్చిన లక్ష మంది ప్రతినిధులును, నాలుగు లక్షల ప్రజలును, అట్లే ప్రమాణములను గావించిరి.. తన సిం హాసనము నుండి లూయి రాజు, "ఫ్రెం చి రాజు నైన నేను, జాతీయ సభవారు గావించిన నూతన రాజ్యాంగ విధానమును, నాయా వ చ్ఛక్తితోను కాపాడెదను. దాసి ననుసరించి చేయబడు అన్ని చట్టములు సమలులో బెట్టెదను..” అని బిగ్గరగా శపధము చేసెను. రాణిగూడ అంగీకార సూచకముగ తన చేతిలోని రాజకుమారుని ప్రజలకు చూపెను. ఈ సమయములో అది