పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
176

ఫ్రెంచిస్వాతంత్ర్య విజయము

సభిప్రాయపడుచుండినవారు కూర్చుండిరి. శాసనసభలకు వోట్ల నచ్చువా రప్పటి యింగ్లాండులో వలె విశేషమగు ఆస్తిగలవారుగా నుండవలయుననియు, శాసనసభలలో భూఖామందులే పలుకు బడి గలిగియుండ వలయుననియు, ఇంగ్లాండులోవలే రెండుశాసన సభ లుండవ లెననియు వీరియభిప్రాయము. అన్ని విధములైన అల్లరులను వెంటనే యణచి వేయ వలయునని కూడ వీరు కోరు చుండిరి. వీరు స్వల్ప సంఖ్యాకులుగ నుండిరి. అధ్యక్షుని యెడమ వైపున రాజు లేని ప్రజాస్వామ్యమును, ప్రతిమానవునికిని వోటు ను, ఆ స్తియున్నను లేకున్నను యోగ్యతను బట్టియే అన్ని యుద్యో గముల కర్హతయును గోరు అతివాదులు ఇరువది ముప్పది మంది కూర్చుండి యుండిరి. వీరికి నాయకులు పేషన్, రాబిస్పీ యరులు. రాజును వెళ్ళగొట్టుట వీరి యుద్దేశ్య మేగాని, సాధ్య పదని తలచి యూరకొనిరి. ఈ అతివాదులకు కుడి వైపునను, పైన చెప్పిన రెండవ పక్షమువారీ కెడమ వైపునను, ఏడెనిమిది వందల సభ్యులు మీరాబో, లఫయతు, ఆబి సైసు మొద లగువారి నాయకత్వము క్రింద కూర్చుండిరి. సర్వసమానత్వ మును ప్రత్యేక హక్కుల నాశనమును వీరు కోరిరి. ప్రజాపరి పాలనమును కాంక్షించిరి. ప్రభుత్వము దృఢముగా నుండు టకు రాజుండి తీరవలయునని వీరి అభిప్రాయము. కాని నిజ మయిన అధికారము ప్రజ ప్రతినిధుల చేతులలోనే యుండి, రాజు నామమాశ్రావశిష్టుడుగా సుండవలెననియే, వీరియుద్దే శ్యము, ప్రజలయందు వీరికి సంపూర్ణ విశ్వాసము గలదు. ప్రస్తు తము కొన్ని చోటుల కొన్ని అల్లరులు జరుగుచున్నను, తిరిగి