Jump to content

పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

175

పండ్రెండవ అధ్యాయము

జాతీయ సభ మయ్యెను. రాజుయొక్కయ, ఆయన యుద్యోగస్థుల యొక్క యు సధికారము రాజధానిలోను, రాష్ట్రములలోను కూడ సదృశ్యమై, ప్రభుత్వోద్యోగు. లధికారము చలాయించలేక యూరకొనిరి. సైన్యములు ప్రజలలో చేరెను. ప్రజలు ఆయుధపాణులైరి. ప్రజలే శాంతికొరకు ప్రయత్నములు చేసి కొనిరి. తమమీద సధికారము చేయుటకును, తమ కష్టములు నీడేర్చుటకును జాతీయసభ మీదనే ప్రజలు తమదృష్టిని నిల్పుకొనియుండిరి.

జాతీయ సభ

జాతీయసభ యొక్క ప్రజాప్రతినిధి శాఖలో కొందరు సుప్రసిద్ధవిద్వాంసులు, 16 గురు వైద్యులు, 102 రు భూస్వా ములు, 212 మంది న్యాయవాదులు,కొం దరు వర్తకులు, కొందఱు మేజిస్ట్రేటులు, చిన్న రైతులు, 12 మంది ప్రభువులు, ఇద్దరు మతగురువులును నుండిరి. అర్ధ చంద్రాకారముగ నధ్యక్షుని యెదుట సభ్యుల యాసనము 'లమర్చబడెను. సభ్యల యుపన్యాసము లందకి వినబడునట్లుగ నుపన్యాస వేదిక నేర్పాటు చేసిరి. జాతీయసభలో నాలుగు విధములైన యభిప్రాయములు గల సభ్యులు కూర్చుండి యుండిరి. అధ్యక్షుని కుడి వైపున ప్రభు జాతియొక్కయు మత గురువులజాతి యొక్కయు ప్రత్యేక హక్కులు సన్ని టిని నిలువ బెట్ట యత్నించుచుండిన ప్రభువులుసు మతగురువులును కూర్చుం డియుండిరి. వారి కెడమ వైపున పుట్టుక వలన ప్రభువులైన వారుగాక్, ధనమువలన ప్రభువులైనవారుండి తీరవలయునని యు, అట్టివారు లేనిది రాజరిక ముసకు ముప్పు వాటిల్లుననియు