పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

150

ఫ్రెంచస్వాతంత్య విజయము

లును ప్రభువులును కలిసి 'యొ కే కులము. ఒకరి కొకరికి బంధు త్వము లుండెను. అన్ని దేశములలోని మతగురువులును కలిసి మరి యొక కులము. దేశాభిమానము కంటే కులాభిమానము ప్రా ముఖ్యముగ నుండెను. కాలక్రమమున పోపును, ఆయన అనుచరు లును ప్రజలకు నైతికాభివృద్ధిని కలుగ జేయు ఆధ్యాత్మిక గురువు లుగ నుండుట మాని ప్రజలను అజ్ఞానములోను మూఢవిశ్వాస ములలోను దాస్యములోను ముంచి ప్రజలనుండి సొమ్మును కాజే యుచుండిన దురాశా ప్రేరితు లైరి. దైవాజ్ఞలంటే పోపులయా జ్ఞలు ప్రథానములయ్యెను, అటులనే రాజులును ప్రభువులును ప్రజలను సంరక్షించి చక్కగా పాలించి వారికి సౌఖ్యమును కలుగ జేయుటకు మారుగా, ప్రజల స్వాతంత్ర్య ములను ఆస్తులను హరించి వారిని నొత్తడి చేయుచుండిరి. 1453 వ సంవత్సరమునుం డియు యూరపుఖండములో ప్రాచీన గ్రీకు భాషలోని స్వతంత్ర భావములు వ్యాపించు చుండుటయు అచ్చు కని పెట్టబడి గ్రంథ ములు విరివిగా వ్యాపించుటయు చూచియున్నాము. మానవాత్మ ఎప్పుడుసు బంధములను తెంచుకొని స్వతంత్రమును పొంద య త్నించును. యూరపులో మానసిక వికాసము కలుగగనే హేతు వాదము, విమర్శన, సత్యాన్వేషణము, విచక్షణాశక్తి ప్రబ లెను. మతసంస్కరణము ప్రారంభ మయ్యెను. పోవు యొక్క యు మతగురువుల యొక్కయు నిరంకుశత్వము పై తిరుగుబాటు కలిగెను. ప్రతివారును స్వయముగా క్రైస్తవ వేదముసు చదు వుకొని మతగురువుల మధ్యవర్తిత్వము లేక ఈశ్వరుని ఆరాధిం చుట కై బైబిలును దేశ భాషలలోనికి తర్జుమా చేసిరి.