పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/160

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

149

అధ్యాయము

లేదని వ్రాసిరి. సమానత్వము', సోదరత్వము, స్వతంత్రతను అనునవి సర్వదుఃఖనాశనకరమగు మంత్రములుగ ప్రజలచే జపించబడెను.


నవీనయుగ
ధర్మములు


యూరపుఖండములోని విషధ దేశములు వివిధ రాజుల క్రింద నుండి వేరు వేరు పరిపాలనలను గలిగి రాజకీ యైక్యత లేక పోయినను యూరపుఖండమున కంతకును రెండు ప్రతిష్టాపనలు మతవిషయిక సాంఘిక ఐక్యతను కలుగ చేసినవి. ఒకటి రోములోనున్న క్రైస్తవ ప్రధాన మతాచార్యుడగు పోపు యొక్క పీఠము. రెండవరి మొఖాసాప్రభ పరంపర. మధ్యమయుగ మున ఈ రెండు ప్రతిస్థాపనలకును యూరపుఖండమంతయు సం పూర్ణముగ లోబడినది. యూరపునందుతటను క్రైస్తవమత ము అవలంబించబడినది. మహమ్మదీయ మతముతో పోరాడి యూరపులో వ్యాపించకుండ చేసిరి. క్రైస్తవుల కందరకును పోపు ప్రథానగురువయ్యెను. యూరపు ఖండాములోని , సందరు ప్రజలును పోపు యొక్క యధికారములకు ఆజ్ఞలకు లోబడియుండిరి. ప్రతి దేశములోను పోవు యొక్క ప్రతినిధులు ప్రబలిరి. పోపు యొక్క నిరంకుశ రాజ్యము యూరపులో స్థాపించబడెను. పోపును ధిక్కరించువాడు ఘోరశిక్షలకు పాలయ్యేను. ఇటు లనే రాజులును ప్రభువులును యూరపులోని అన్ని దేశముల లోను ప్రజల పైన రాజ్యము చేసిరి. అన్ని దేశములలోని రాజు