పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
148

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

గల గౌరవముచేత ఫ్రెంచి రాజు లీయన జోలికి రాలేదు. ఫ్రాన్సు లో అనేక చోటుల తిరిగి తుదకు ప్యారిసును చేరెను. ఇచట పనిమిది సంవత్సరములు నివసించెను. అనారోగ్యమువల నను 'పేదిరిక మువలనను విశేషముగ బాదపడి 1778 సంవత్స రము జులై నెల 2 వ తేదీన ప్యారిసుకు సమీపముననున్న ఎర్మి నూ వెల్లి యను గ్రాయమున మరణించెను. ఈయన శవమును పాతి పెట్టుటకు మతగురువులు రాలేదు. దాని నొక చిన్న సరసులోని ద్వీపమున మిత్రులు పాతి పెట్టిరి, తరువాత పదునారు సంవత్సరములకు, ఈయన సిద్ధాంతముల ననుంచి ఫ్రాన్సు లో విప్లవముకలిగి రాజులుపోయి ప్రజా సామ్య మేర్పడిన కాలమున, ప్రజా ప్రభుత్వము వారు పిరంగుల మోతలతోను వాద్యములతోను, గొప్పయుత్సవముతోను నీయన అస్తుల నీద్వీ పమునుండి తెచ్చిఫ్రాంసులోని "గొప్పవారి సమాదు లుంచబడిన ప్రదేశములో ప్రజల జయజయధ్వనుల మధ్య పాతి పెట్టిరి.


వాల్ల్టేరు. రూసో పండితులు మాత్రమేమేగాక మాంటే స్క్యూ మొదలగు పెక్కు గ్రంథ కర్తలు సుప్రసిద్ధ గ్రంథము లను వ్రాసిరి. ఆకాలమున డిడోరో మొదలగు గ్రంధకర్తలు ఫ్రెంచి: జ్ఞానసర్వస్వమును బయలు దేర దీసి అందులో సమస్త విషయములను గూర్చియు జనులకు జ్ఞానమును కలుగ జేసిరి. తత్వజ్ఞులని కొందరును, ఆర్థిక శాస్త్రజ్ఞులని కొందరు, గంధ కర్తలు అనేక గ్రంథములను వ్రాసిరి. మొత్తము మీద ఆకా లపు అందరు గ్రందకర్తలును ప్రజలనుభ వించుచున్న సమస్త కష్టములకును స్వతంత్రతను పొందుటకన్న వేరుతరుణో పాయము