పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

151

పదియవ అధ్యాయము


విగ్రహారాధన ఖండించబడెను. పోపుకు లోబడి యుండనక్కర లేదు. బైబిలులోనున్న సంగతులే ప్రమాణములుగాని, పోపు యొక్క ఆజ్ఞలు ప్రమాణములుగావు, ఆత్మస్వాతంత్ర్యము ప్రకటింపబడెను. ఇట్లు ఆత్మ స్వాతంత్యమును స్థాపించిన " వారిలో ముఖ్యుడు మార్టిను లూధకుమహామహుడు. ఆయన స్థాపించిన ప్రొటెస్టెంటు మతమును జర్మనీ దేశీయులు ప్రధ మమున అవలంబించిరి. జర్మనీ మత స్వాతంత్యోద్యమమునకు ప్రథమస్థానము వహించినది. పోఫులును, వారి యనుచరులును, వారి స్నేహితులగు రాజులును, ప్రభువులుసు ప్రొటెస్తేంటులను ఘోరముగ శిక్షించి మరణములపాలు చేసినకొలదియు వీరు ధర్మసంస్థాపనకొరకు చేయుచున్న త్యాగములును, పొందుచున్న కష్టములును ప్రజల హృదయముల నాకర్షించి ప్రొటెస్టేంటు మత ము త్వరితముగ వ్యాపించెను. నిరంకుశ త్వమునకును స్వతంత్ర తకును కలిగిన పోరాటములో స్వతంత్రతయే తనయొక్క ఆత్మశక్తి వలనను స్వార్త త్యాగమువలనను జయముందినది, నిరం కుశత్వము యొక్క చెరసాలలు, మరణశిక్షలు స్వతంత్రత సణపజాలక పోగ, స్వతంత్రతకు జయింప నలవి గాని శక్తిని కలుగ జేసినవి. ఈ మత స్వతంత్రంలోను, యూరపులో రాజకీయ స్వతంత్రత బయలు దేరినది. రాజులయొక్కయు ప్రభువుల యొక్కయు నిరంకుశత్వమును నిర్మూలము చేసి రాజు కీయ స్వతంత్రమును సంపాదించుటకు ఫ్రాంన్సు దేశము ముందుగ దారితీసినది. రాజకీయస్వతంత్ర సంవాదనకు ముఖ్యులగు వారు వాల్టేరు, రూసోపండితులు. వికసించిన ఆత్మ ఎట్టి దాస్య