పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
130

ఫ్రెంచిస్వాతంత్ర్య విజయము


రాష్ట్రములు స్వేచ్ఛగా సరుకులను ఎగుమతి దిగుమతులు చేసి కొనవచ్చును. మరికొన్ని రాష్ట్రముల చుట్టును సుంకపు శాల లేర్పఱచి సరకులు పన్ను లిచ్చన గాని రాక పోకలు చేయుటకు వీలు లేకుండ చేసిరి. కొల పాత్రలు తూనిక రాళ్ళను అన్ని రాష్ట్రములలో సమానముగ లేపు. ధాన్యము దేశములోని ఒక చోటునుండి మరియొకచోటుకి ధారాళముగ పోవుటకు వీలు లేదు - నిర్పందములకు లోనయ్యెను. పరిశ్రమలు కొన్ని సం ఘములకే యిచ్చియుండుట వలన అందరికి అందుబాటులో లేక చాల ప్రజలకు నష్టముగనుండెను, వ్యాపార స్వేచ్ఛ, పరిశ్రమల స్వేచ్చ అందరికినీ లేకుండెను,

ఉప్పు
పన్నులు

వ్యవసాయము .క్షీణించెను. రయితులు విశేషమగు పన్నుల బాదచే కృశించు చుండిరి. రాజు యొక్క నిరంకుశత్వము కన్నను ప్రభువుల యొక్కయు మతగురువుల యొక్కయు నొత్తిడి ఎక్కువగ నుండెను. భూమిపన్నులను ఇతర పన్నలను చెల్లించుచు, ధాన్యము ధారాళముగ రాకపోకలు చేయుటకు వీలు లేక , ప్రభువుల విలాసార్థము పావురములను, వేటలును ఉంచవలసి యుండి, ప్రభువుల దాక్షపండ్లను గాను గలలో తిప్పుట, ప్రభువుల ధాన్యమును విసరుట, ప్రభువుల రోడ్లను మరమ్మతు చేయుట, ప్రభువుల పొలములలో పని చేయుట మొదలగు పనులను చేయవలసి యుండియు, రైతులు గొప్ప భారమును బాధలను అనుభవించుచు పైగా మిగుల తక్కువవారుగ చూడబడు చుండిరి. వీరి కిందనుండిన వ్యవసాయ బానిసల సంగతి చెప్పనక్కఱ లేదు. వీరు పశువులకన్న హీన