పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

129

పదియవ అధ్యాయము

మాత్రమే సంక్రమించు చున్నందున చిన్న కుమారులును కుమా ర్తెలుసు తరుచుగా మత పీఠములలో మతగురువులుగను సన్యా సినులుగను చేరిరి.ఈవిధముగా గొప్ప మత పీఠములును మత ఉద్యోగములును ప్రభువులకే చెందెను. చిన్న మతగురువులు గనే సామాన్య జనులు ప్రవేశించిరి. మతగురువులకు దేశము లోని ప్రతి భూమి మీదను పదవవంతు అయివజు యియ్యవలెను. ఇదిగాక మతగురువులకును మతపీఠములకును విశేషమగు ఆస్తు లుగలవు. ఈ ఆస్తులన్నియు పన్నుల నుండి మినహాయింపు కాబ డినవి. ప్రభువుల యొక్క భూముల మిద పన్ను ఇయ్యవలసి నపని లేదు. దేశములోని రెండువంతుల భూమి పన్నులు లేకుండ ప్రభువుల చేతిలోసు మత గురువుల చేతిలోను ఉండును. మూడు వంతు భూమి మాత్రమే సామాన్య ప్రజల చేతిలో నుండెను. దీని మీదనే భూమిపన్ను (టాలీ) తొమ్మిదికోట్లు, పైగా పండిన పంటలో కొంత భాగము చెల్లించుట వలన పదుమూకోట్లు; ఇతర పన్నులు అయిదు కోట్లన్నర వ్యవసాయకుల చేత చెల్లించ బడుచుండెను. ఒకే నేరమునకు ప్రభువునకు మిగుల దేలిక యగు శిక్షయు, సామాన్యునకు మిగుల కఠినమగు శిక్షయు, ఇయ్య బడుచుండెను. ప్రభువుకు రెండు సంవత్సరముల శిక్ష వేయగ, సామాన్యుని కానేరమునకే మరణదండన విధించబడు చుండెను. కొన్ని రాష్ట్రములకు కొంత స్వతంత్ర ముండెను. మరికొన్ని రాష్ట్రములు రాజు యొక్క నిరంకుశత్వమునకు లోబడెను. కొందఱు వర్తకులును వర్తక సంఘములును రాజునకు ద్రవ్య మిచ్చి కొన్ని ప్రత్యేక వర్తక హక్కులను కొనుక్కొనిరి. కొన్ని